iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. FIRలో నమ్మలేని నిజాలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొత్త రచ్చ మొదలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్ లో ఏముందంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొత్త రచ్చ మొదలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్ లో ఏముందంటే..

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. FIRలో నమ్మలేని నిజాలు..!

నెలకో వివాదంతో తెలుగు ఇండస్ట్రీ వార్తల్లో నిలుస్తుంది. డ్రగ్ కేసులో స్టార్ సపోర్టింగ్ యాక్టర్స్ హేమ పేరు బయటకు రావడం.. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం వంటి సంఘటనలు సంచలనం కలిగించాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా పై పోలీసు కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేసిన యువతి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని, వర్క్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాడంటూ కంప్లయింట్‌లో పేర్కొంది. అయితే ఈ కేసును రాయదుర్గం పోలీసులు.. నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. అక్కడ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘ 2017లో ‘ఢీ’షోలో జానీ మాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేయాలంటూ ఆయన టీం నుండి కాల్ వచ్చింది. 2019లో ఆయన దగ్గర చేరాను. ఓ షో కోసం జానీ మాస్టర్, మరో ఇద్దరితో కలిసి ముంబయి వెళ్లాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడు. ఈ విషయం బయట చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. షూటింగ్ సమయంలో తాను చెప్పినట్లు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. తరచుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. షూటింగ్ వాహనంలో కూడా సెక్సువల్ హెర్రామెంట్ చేశాడు. కేవలం ముంబయిలో మాత్రమే కాదు.. చెన్నై, ఇతర ఔట్ డోర్ షూటింగ్స్‌లో కూడా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. నార్సింగిలోని తన ఇంట్లో కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. మతం మార్చుకోవాలని, తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం పెట్టాడు. ఒప్పుకోకపోవడంతో నాపై దాడి చేశాడు. అంతేకాకుండా వర్క్ ఇవ్వకుండా హింసించాడు‘ అని పేర్కొంది బాధితురాలు.

 గత నెల 28న ఓ పార్శిల్ తన ఇంటికి వచ్చిందని.. దీనిపై ‘ఇదే నీ చివరి షూటింగ్’ అని రాసి ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. అతడి నుండి తనకు ప్రాణ హాని ఉందని కంప్లైంట్ చేసింది. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. 376 (రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు), గాయపరచడం (232) సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో తిరుచిత్రాంబలం (తెలుగులో తిరు)లో మేఘం కరిగెను సాంగ్‌ మంచి కొరియోగ్రఫీ చేసినందుకు మరో డ్యాన్స్ మాస్టర్ సతీశ్‌తో కలిసి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఎన్నికయ్యాడు జానీ. ఈ ఆనందంలో ఉండగానే.. ఇలా వివాదంలో చిక్కుకున్నాడు. మెకానిక్ నుండి డ్యాన్సర్‌గా ఎదిగి.. ఎంతో మంది స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తూ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు. అల వైకుంఠపురంలో బుట్టబొమ్మ, పుష్పలో శ్రీవల్లీ, బీస్ట్‌లో అరబిత్ కుత్తు.. తిరులో మేఘం కరిగెను, జైలర్‌లో నువు కావాలయ్యా సాంగ్స్‌తో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. బాలీవుడ్ చిత్రాలకు పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఆరోపణలు కెరీర్ పై ఎఫెక్ట్ అవకాశాలున్నాయా..? అభిప్రాాయాన్ని తెలపండి.