iDreamPost
android-app
ios-app

Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ కి మిక్స్డ్ టాక్.. రామ్ మాత్రం సూపర్ హిట్!

  • Published Aug 16, 2024 | 1:36 PM Updated Updated Aug 16, 2024 | 1:36 PM

రామ్-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ఈ చిత్రంలో రామ్ ఊరమాస్ యాక్టింగ్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లో రామ్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

రామ్-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ఈ చిత్రంలో రామ్ ఊరమాస్ యాక్టింగ్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లో రామ్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 16, 2024 | 1:36 PMUpdated Aug 16, 2024 | 1:36 PM
Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ కి మిక్స్డ్ టాక్.. రామ్ మాత్రం సూపర్ హిట్!

ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎన్నో పురిటి నొప్పులను ఓర్చుకోవాల్సి ఉంటుంది. అలా 24 క్రాఫ్ట్ లను ఏకం చేసి మూవీని వెండితెరపైకి తీసుకురావడం అన్నది కత్తిమీదసామే. ఇందుకోసం ఎన్నో ఆర్థిక కష్ట, నష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఆ సినిమా విజయం సాధిస్తే.. తాము పడిన కష్టాన్ని అంతా మర్చిపోయి సంతోషంగా ఫీల్ అవుతారు మేకర్స్. ఇదే క్రమంలో మూవీ ఫ్లాప్ అయితే.. యూనిట్ బాధ వర్ణణాతీతం. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. తాజాగా ఆగస్ట్ 15 కానుకగా థియేటర్లలోకి వచ్చింది రామ్-పూరీ జగన్నాథ్ ల మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ రామ్ యాక్టింగ్ కు మాత్రం ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.

రామ్ పోతినేని.. 2006లో వచ్చిన దేవదాస్ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అదీకాక ఫస్ట్ మూవీకే ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్ ను కూడా గెలిచుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కెరీర్ ఆరంభంలో ప్రేమ కథలే ఎక్కువ చేశాడు రామ్. ఇక స్క్రీన్ పై అతడి ఎనర్జీ చూస్తే ప్రేక్షకులకు మాంచి కిక్కొస్తుంది. కాగా.. రానురాను మాస్ సినిమాలు చేయడం ప్రారంభించాడు. 2019లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో తనలో ఉన్న ఊర మాస్ యాక్టర్ ను బయటకి తీశాడు. ఆ సినిమాలో రామ్ యాక్టింగ్ కు మాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఇప్పుడు మళ్లీ 5 ఏళ్ల తర్వాత ఈ మూవీ సీక్వెల్ లో నటించాడు రామ్.

ram

డబుల్ ఇస్మార్ట్ తో ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్. ట్రైలర్ లోనే ఇది ఊర మాస్ సినిమా అని మేకర్స్ చెప్పకనే చెప్పారు. అయితే సినిమాకు ఆడియెన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇది కాసేపు పక్కనపెడితే.. మూవీలో రామ్ యాక్టింగ్ ఇరగదీశాడు. అతడు సిల్వర్ స్క్రీన్ పై శివతాండవం ఆడాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అయితే ఊచకోతనే చెప్పాలి. అతడు చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. రామ్ ఎనర్జీకి తోడు మాస్ డైలాగ్స్, ఫైట్స్ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ మూవీలో అతడు వందకు వంద శాతం తన పాత్రకు న్యాయం చేశాడు. సంజయ్ దత్ లాంటి సీనియర్ హీరోను కూడా డామినేట్ చేస్తూ తన ఫర్పామెన్స్ తో మెప్పించాడు. సినిమా మెుత్తాన్ని తన భుజస్కంధాలపై మోశాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నాగానీ.. డబుల్ ఇస్మార్ట్ లో రామ్ యాక్టింగ్ కు ప్రేక్షకులు మరోసారి బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ మూవీలో రామ్ ఊరమాస్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş