iDreamPost
android-app
ios-app

Nellore Neeraja: ఎప్పుడూ నవ్వించే నెల్లూరు నీరజ తొలిసారి కన్నీరు! కారణం?

యూట్యూబ్ లో తన కామెడీతో కితకితలు పెట్టించారు నెల్లూరు నీరజ. ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా వీడియోస్ చూసేవారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆమె ఎమోషనల్ అయ్యారు.

యూట్యూబ్ లో తన కామెడీతో కితకితలు పెట్టించారు నెల్లూరు నీరజ. ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా వీడియోస్ చూసేవారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆమె ఎమోషనల్ అయ్యారు.

Nellore Neeraja: ఎప్పుడూ నవ్వించే నెల్లూరు నీరజ తొలిసారి కన్నీరు! కారణం?

ఇండస్ట్రీలో తమ కామెడీతో కితకితలు పెట్టించారు కొంత మంది నటీమణులు. రమా ప్రభ, శ్రీలక్ష్మి, కోవై సరళ, కల్పనా రాయ్, గీతా సింగ్, విద్యుల్లేఖా రామన్ స్టార్ కమెడియన్లుగా పేరు తెచ్చుకున్నారు. తమ కామెడీతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. కేవలం మేల్ కమెడియన్సే కాదూ.. మేము తమ కామెడీతో నవ్వించగలం అని నిరూపించారు. అయితే బుల్లితెర, డిజిటల్ రంగంలో పై కూడా కొంత మంది తమ పంచ్ డైలాగులతో నవ్వులు, పువ్వులు పూయిస్తున్నారు. అందులో నెల్లూరి నీరజ ఒకరు. ఎప్పటి నుండో ఆమె ఇండస్ట్రీలోనే ఉన్నారు. ప్రముఖ కామెడీ యూట్యూబర్ ప్రసాద్ బెహరా వెబ్ సిరీస్ చూసే వాళ్లకు ఆమె సుపరిచితమే. ప్రసాదూ అంటూ తనదైన మాట తీరుతో నవ్విస్తూ ఉంటుంది ఈమె.

ఈటీవీలో ప్రసారమయ్యే హంగామాతో పాటు జబర్దస్త్ షోల్లో కూడా కామెడీ పండించింది ఈవిడ. ఇక యూట్యూబ్ లో అయితే.. ప్రసాద్, ఈమె కామెడీ వేరే లెవల్. వీరిద్దరూ కలిసి ఎన్నో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మింస్‌లో నటించారు. చిన్నారి పెళ్లికూతురు, మిలినియర్, బ్రతుకు ఎడ్ల బండి, సింగిల్ సింతకాయ్, మా విడాకులు వంటి షార్ట్ అండ్ సిరీస్‌లు చేశారు. ప్రసాద్, నెల్లూరు నీరజ కాంబో యూట్యూబ్ వీడియోల్లో ది బెస్ట్ కామెడీ. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే నెల్లూరు నీరజ.. ఇప్పుడు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన ఇన్ స్టా వేదికగా.. ఓ వీడియోను షేర్ చేశారు. ఇంతకు ఆ వీడియోలో ఏమి ఉందంటే..

‘హాయ్ అండీ.. నమస్తే.. నేను మీ నెల్లూరు నీరజని. ఈ రోజు మీతో నా ఎమోషన్ షేర్ చేసుకోవాలనిపించింది. 13 సంవత్సరాలు అయ్యింది నేను ఇండస్ట్రీలోకి వచ్చి. ఈ 13 ఏళ్లల్లో మాగ్జిమమ్ అన్ని షోలు చేశాను. బుల్లితెరపై అన్ని కామెడీ షోలు చేసుంటాను. యూట్యూబ్‌లో కూడా సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేశాను. కానీ చిన్న వెలితి ఉండిపోయింది. ఏంటీ వెండితెరపై కనిపించకుండా చనిపోతానా అని. చిన్న చిన్న సినిమాలు చేశాను..కానీ అవి చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు కావవి. కానీ ఇప్పుడు సిద్దు హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్‌లో ఆయనకు మేనత్తగా చేశాను. ట్రైలర్ లో నన్ను నేను చూసుకునే సరికి.. 13 ఏళ్ల కష్టం.. ఎలా వెళ్లిపోయింది.. అలా వెళ్లిపోయింది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యింది నీరజ.

‘ ఎన్ని అవమానాలు పడ్డానో. అవుడేటెడ్ కామెడీ అంటూ ఎగతాళి చేశారు. నీ పని అయిపోయిందంటూ కామెంట్స్ కూడా చేశారు. కానీ ఈ రోజు సిద్దు సినిమాలో కనిపించాను. ఇదంతా హీరో సిద్దు వల్లే సాధ్యమైంది. థాంక్యూ సిద్దు సార్’ అంటూ ఏడ్చేశారు నెల్లూరు నీరజ. దీంతో నెటిజన్లు మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందంటూ కామెంట్స్ చేశారు.  కాగా, సిద్దు, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ ట్రైలర్ రాగా, ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. అందులో ట్రయల్ రాగానే.. ముందుగా నెల్లూరు నీరజ.. కనిపిస్తుంది. ఇందులో గుర్తింపు ఉన్న పాత్ర దక్కడంతో ఆమెకు తన ఆనందాన్ని కన్నీటి రూపంలో వ్యక్తం చేస్తూ.. తాను పడ్డ కష్టానికి దక్కిన ప్రతి ఫలంగా భావిస్తూ.. ఆనంద భాష్పాలను రాల్చింది ఆవిడ. ఇక ఈ మూవీ మార్చి 29న రిలీజ్ కాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Iam Nellore Neeraja actress 🧿❤️ (@nelloreneeraja_actress)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap