iDreamPost
android-app
ios-app

ఎఫ్ 3 టికెట్ రేట్లు – నిజంగా మేలేనా

  • Published May 19, 2022 | 6:39 PM Updated Updated May 19, 2022 | 7:00 PM
ఎఫ్ 3 టికెట్ రేట్లు – నిజంగా మేలేనా

ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న ఎఫ్3 ప్రమోషన్లు యమా స్పీడ్ మీద జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి , హీరోలు వెంకటేష్-వరుణ్ తేజ్ లు వీటిలో ఫుల్ గా పాల్గొంటున్నారు. హీరోయిన్ల కాల్ షీట్స్ సమస్య వల్ల పూర్తిగా అందుబాటులోకి రావడం లేదు కానీ రేపో ఎల్లుండో వాళ్ళతో కూడా స్పెషల్ ప్రోగ్రాంస్ ఉంటాయి. సర్కారు వారి పాట నెమ్మదించడంతో ఆ అడ్వాంటేజ్ ని వాడుకోవడానికి ఎఫ్3 ఎదురు చూస్తోంది. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈ ఎంటర్ టైనర్ ఎఫ్2 ని మించిన సక్సెస్ అందుకుంటుందనే ధీమా టీమ్ లో కనిపిస్తోంది.ట్రైలర్ అంచనాలకు తగ్గట్టే ఉంది కానీ కామెడీ మోతాదు ఎంతుందో చూడాలి.

సరే ఇక అసలు విషయానికి వస్తే దిల్ రాజు పదే పదే టికెట్ రేట్లు పాతవే ఉంటాయని నొక్కి చెప్పడం హైలైట్ అవుతోంది. గవర్నమెంట్ ఇచ్చిన పాత విధానాన్నే ఫాలో అవుతామని చెప్పారు. అయితే తెలంగాణ మల్టీ ప్లెక్సులో గరిష్ట ధర జిఎస్టితో కలిపి 250 రూపాయలుగా పేర్కొన్నారు. ఏఎంబి లాంటి స్పెషల్ వాటికి ఈ ధర మీద అదనంగా జిఎస్టి ఉంటుంది. వాస్తవానికి ఓల్డ్ రేట్ 200 రూపాయలే. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ జిఓలు రాకముందు 150 ఉండేది. సింగల్ స్క్రీన్లలో 175 బాల్కనీగా పేర్కొంటున్నారు. ఇది కూడా 125 ఉండాల్సింది. కాకపోతే 295 కన్నా కొంత నయం అనే ఊరట తప్ప నిజానికి మరీ విపరీతంగా తగ్గించడం అంటూ కనిపించదు.

కానీ ఏపిలో చాలా నయం. మల్టీప్లెక్స్ ఎక్స్ పీరియన్స్ ని 180 రూపాయల లోపే పొందొచ్చు. సింగల్ స్క్రీన్లలో 100 నుంచి 110 మధ్యలో ఉంటుంది. ఇక్కడా పెంపుకి వెళ్లమంటున్నారు కాబట్టి టెన్షన్ లేదు. ఈ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఆక్యుపెన్సీ రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఓకే కానీ ఇకపై చిన్న సినిమాలు బ్రతకాలంటే మాత్రం టికెట్ల విషయంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఒక అండర్ స్టాండింగ్ తో జనం వచ్చే మార్గాలను చూడాలి. అంతే తప్ప పర్మిషన్ల సాకుతో పెంచుకోవడానికి బ్రేకులు వేయలేకపోతే ఇన్ డైరెక్ట్ గా కాదు నేరుగానే ఓటిటిలను ప్రోత్సహించినట్టు అవుతుంది. చూడాలి ఎఫ్3 ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో