iDreamPost
android-app
ios-app

సలార్ లో ప్రభాస్ కాళ్ళు పట్టుకునే సీన్.. డూప్ పెట్టకుండానే! ఇది కదా రాజు అంటే!

  • Published Jan 28, 2024 | 12:37 PM Updated Updated Jan 28, 2024 | 5:04 PM

ప్రభాస్ స్క్రీన్ మీదే కాదు.. బయట కూడా హీరోనే. ఈ విషయం అందరూ ఒప్పుకునేందుకు ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది.

ప్రభాస్ స్క్రీన్ మీదే కాదు.. బయట కూడా హీరోనే. ఈ విషయం అందరూ ఒప్పుకునేందుకు ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది.

  • Published Jan 28, 2024 | 12:37 PMUpdated Jan 28, 2024 | 5:04 PM
సలార్ లో ప్రభాస్ కాళ్ళు పట్టుకునే సీన్.. డూప్ పెట్టకుండానే! ఇది కదా రాజు అంటే!

పాన్ వరల్డ్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో ప్రభాస్ రేంజ్ పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లిపోయింది. కల్కీ మూవీతో అది మరో స్థాయికి వెళ్లే అవకాశం కూడా ఉంది. మూవీ అప్ డేట్స్ మాత్రమే కాకుండా.. ప్రభాస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా చాలానే వార్తలు వింటూ ఉంటారు. ప్రభాస్ ఆతిథ్యం గురించి, వ్యక్తిత్వం గురించి కథలు కథలుగా చెప్తూ ఉంటారు. వాటిని వింటూ ఫ్యాన్స్ గర్వంగా ఫీలవుతూ ఉంటారు. వాళ్లు ఇప్పుడు కాలర్ ఎగరేసుకునే విషయం ఒకటి వైరల్ అవుతోంది. అది ప్రభాస్ ప్రొఫెషన్ అండ్ క్యారెక్టర్ కి సంబంధించింది.

ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ సినిమాతో దాదాపు ఆరేళ్ల తర్వాత మా అన్న సినిమా అంటూ గర్వంగా చెప్పుకుని సంబరాలు చేసుకున్నారు. సలారోడి దెబ్బకు టాలీవుడ్ చాలా రికార్డులు గల్లంతు అయ్యాయి. అంతేకాకుండా శౌర్యాంగ పర్వానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు, అంచనాలను క్రియేట్ చేసింది. ఇప్పటి నుంచే ఫ్యాన్స్ సలార్ పార్ట్ 2 గురించి ఊహాగానాలు కూడా స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఓటీటీలో సలార్ సినిమాని రిపీటెడ్ గా చూస్తూ.. ఓటీటీలో కూడా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు సలార్ సినిమాకి సంబంధించి షూటింగ్ టైమ్ లో జరిగిన ఒక విషయం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

అదేంటంటే.. నారంగ్ కొడుకుని చంపినందుకు దేవాని వరదని బంధిస్తారు. సభలో హాజరు పరిచి దేవా, వరదలో ఎవరిని కావాలో వారిని చంపుకోవచ్చు అంటూ నారంగ్ కు అవకాశం ఇస్తారు. అప్పటికే నారంగ్ మైండ్ ని భారవ డైవర్ట్ చేసి వరదని చంపేలా ఉసిగొలుపుతాడు. అప్పుడు దేవా.. నారంగ్ ని బతిమాలుతూ ఉంటాడు వరదాని వదిలేయాలని, తనని ఏమైనా చేసుకోమని కోరతాడు. తన ఫ్రెండ్ ని కాపాడుకోవడం కోసం నారంగ్ కాళ్లు కూడా పట్టుకుంటాడు. ఆ కాళ్లు పట్టుకుని సీన్ ని చాలా బాగా తీయాలని ప్లాన్ చేసుకున్నారంట. మూడు యాంగిల్స్ లో కెమెరాలను సెట్ చేసి షూట్ చేశారు. అయితే రెండో టేక్ చేస్తున్నప్పుడు ప్రభాస్ కి బదులు బాడీ డబుల్ వాడాలని భావించారంట. ఆ విషయాన్ని ప్రభాస్ కి చెప్పగా అక్కర్లేదు తానే షూట్ చేస్తానని చెప్పాడట.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నారంగ్ క్యారెక్టర్ చేసిన ఎంఎస్ చౌదరి కూడా అది నిజమే అంటూ నిర్ధారించాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇండస్ట్రీలో ప్రభాస్ మీద రెస్పెక్ట్ మరింత పెరిగింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఫ్యాన్స్ అందరూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ద టీజ్ ప్రభాస్ అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రభాస్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరోనే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. కల్కీ సినిమా కోసం పాన్ ఇండియా లెవల్లో ఉన్న అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ తర్వాత డైరెక్టర్ మారుతీతో చేస్తున్న ది రాజా సాబ్ అనే సినిమా రాబోతోంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio