iDreamPost
android-app
ios-app

Etharkum Thunindhavan : సమస్య కోసం యుద్ధం చేసే ఈటి

  • Published Mar 02, 2022 | 1:58 PM Updated Updated Mar 02, 2022 | 1:58 PM
Etharkum Thunindhavan : సమస్య కోసం యుద్ధం చేసే ఈటి

కేవలం ఒకే రోజు గ్యాప్ తో రాధే శ్యామ్ తో ఢీ కొట్టేందుకు సిద్ధపడ్డ సూర్య కొత్త సినిమా ఈటి (ఎవరికి తలవంచడు) ట్రైలర్ ఇవాళ విజయ్ దేవరకొండ ద్వారా ఆన్ లైన్ లోకి వచ్చేసింది. గత రెండు సినిమాలు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ లు ఓటిటి రూటు తీసుకోవడంతో దీని మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. అందులోనూ ఊర మాస్ లుక్ లో సూర్యని ప్రెజెంట్ చేసిన తీరు అంచనాలు పెంచేసింది. కొన్నేళ్ల క్రితం బ్రదర్స్ కు స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్న సూర్య మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ ఈటికి తన గొంతుని ఇవ్వడం విశేషం. మార్చి 10 ఒకేసారి తమిళం తెలుగులో రాబోతున్న ఈటి ట్రైలర్ లో విశేషాలు ఏంటో చూద్దాం.

మంచి ఊరు, చక్కని కుటుంబంతో హాయిగా గడిచిపోతున్న జీవితం కృష్ణమోహన్(సూర్య)ది. ఊళ్ళో ఏ సమస్య వచ్చినా తీరుస్తాడు, ఏదైనా ఇబ్బంది కలిగినా భరించలేడు. ఓ అమ్మాయి(ప్రియాంక అరుళ్ మోహన్)తో ప్రేమకథ కూడా ఉంటుంది. ఇలా సాఫీగా జరిగిపోతున్న ఇతని జీవితంలో అలజడి మొదలువుతుంది. బయటికి కనిపించని శత్రువు సృష్టించిన ప్రమాదంలో అమాయకులైన ఎందరో అమ్మాయిలు ఉన్నారని గుర్తిస్తాడు. దీంతో కృష్ణ ప్రయాణం గ్రామం నుంచి నగరానికి వెళ్తుంది. తప్పు చేసే వాళ్ళ విషయంలో జడ్జ్ నేనే అని భావించే ఈటి చివరికి తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు, ఎందరి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చాడో తెరమీద చూడాలి

ట్రైలర్ ని మంచి డెప్త్ తో కట్ చేశారు. కథ పూర్తిగా అర్థం కాకుండా చాలా తెలివిగా క్లూస్ ఇచ్చారు. సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం విశేషం. దర్శకుడు పాండి రాజ్ తన రెగ్యులర్ స్టైల్ ని ఫాలో అవుతూనే ఈసారి అర్బన్ డ్రామాని జొప్పించారు. కాకపోతే అతి సెంటిమెంట్ ని ఇరికించకుండా తీసినట్టు కనిపిస్తోంది. సత్యరాజ్, శరణ్య తదితర సీనియర్లు ఉన్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం అందించగా ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. ఫైనల్ గా థియేటర్ కు వెళ్లొచ్చు అనేలా ట్రైలర్ ని కట్ చేసిన తీరు ఆకట్టుకునేలాగే ఉంది. పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ తో పోటీ పడుతున్న ఈటి కాన్ఫిడెన్స్ హై లెవెల్ లోనే ఉంది

Trailer : https://youtu.be/pcpDILI6pXs 

Also Read : Ramarao On Duty : మాస్ మహారాజా ఎప్పుడు వస్తాడో