iDreamPost
android-app
ios-app

Ramarao On Duty : మాస్ మహారాజా ఎప్పుడు వస్తాడో

  • Published Mar 02, 2022 | 1:46 PM Updated Updated Mar 02, 2022 | 1:46 PM
  • Published Mar 02, 2022 | 1:46 PMUpdated Mar 02, 2022 | 1:46 PM
Ramarao On Duty : మాస్ మహారాజా ఎప్పుడు వస్తాడో

నిన్న విడుదలైన రవితేజ కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ టీజర్ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది. అభిమానులకు నచ్చినప్పటికీ ఇందులోనూ రొటీన్ అంశాలు ఎక్కువగా కనిపించాయన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపించాయి. రెవిన్యూ అధికారిగా మాస్ మహారాజా కొత్తగా అనిపిస్తున్నప్పటికీ బాడీ లాంగ్వేజ్, మ్యానరిజం ఎప్పటిలాగే తనదైన శైలిలో రెగ్యులర్ గానే వెళ్లాయి. అయితే దీన్ని బట్టి కేవలం నిమిషంన్నర వీడియో చూసి కంక్లూజన్ కు రాలేం కానీ ఇప్పుడున్న ట్రెండ్ లో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే సూత్రాన్ని మనవాళ్ళు ఫాలో అవుతున్న తరుణంలో దీని మీద అంచనాలు ఉండటం సహజం.

రవితేజ ఏ రూట్ లో వెళ్లినా ఏ పాత్రలో కనిపించినా తన ఎనర్జీని సరిగా వాడుకుని కాసిన్ని ట్విస్టులు, ఆసక్తి రేపెలా ఓ మోస్తరు కథా కథనాలు ఉంటే చాలు హిట్ ఖాయమని 2021 క్రాక్ నిరూపించింది. సో రామారావు ఆన్ డ్యూటీలోనూ అలాంటివి ఎక్స్ పెక్ట్ చేయడంలో తప్పేమి లేదు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ కి సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు. ఆయన నేపధ్య సంగీతం ఏమంత గొప్పగా అనిపించలేదు. ముందు మార్చి 25 లేదా ఏప్రిల్ 14 అని రెండు ఆప్షన్లు రిలీజ్ డేట్ కోసం పెట్టుకున్న యూనిట్ ఇప్పుడు కమింగ్ సూన్ తో సరిపుచ్చింది. ఆర్ఆర్ఆర్ కన్ఫర్మ్ కాబట్టి ఈ నెల వచ్చే అవకాశం లేనట్టే.

కెజిఎఫ్ 2తో నేరుగా ఢీ కొట్టే సాహసం చేయలేకపోవచ్చు. అప్పుడు ఏప్రిల్ 1కి రావడం మినహా వేరే ఛాయస్ ఉండదు. ప్రస్తుతానికి ఆ డేట్ కి మిషన్ ఇంపాజిబుల్ ఒకటే షెడ్యూల్ చేసి ఉంది. సో ఇబ్బంది లేదు. దాన్ని మిస్ చేసుకుంటే ఏప్రిల్ చివరి వారంలో ఆచార్యతో తలపడాల్సి ఉంటుంది. దీనికి రవితేజే అంగీకరించడు. మళ్ళీ మేలో సర్కారు వారి పాట తర్వాత ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విడుదలని లాక్ చేయడం ఒక రకంగా సవాలే. దివ్యాంశ, రజిష హీరోయిన్లుగా  నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ తర్వాత రవితేజ ధమాకా వేసవిలో వచ్చే ఛాన్స్ ఉంది. ఆపై దసరాకు రావణాసురని తీసుకొస్తారు. లైనప్ మాత్రం జోరుగా ఉంది

Also Read : Vikram : కమల్ సినిమాకు మతిపోయే ఆఫర్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss