iDreamPost

నాకు భర్త కావాలి.. ఒంటరిగా ఉండాలని లేదు.. ఎస్తేర్ కామెంట్స్ వైరల్

గ్లామరస్ అండ్ బోల్డ్ పాత్రలతో మెప్పిస్తోన్న టాలీవుడ్ బ్యూటీ ఎస్తేర్. ఇటీవల టెనెండ్ అనే మూవీతో పలకరించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.

గ్లామరస్ అండ్ బోల్డ్ పాత్రలతో మెప్పిస్తోన్న టాలీవుడ్ బ్యూటీ ఎస్తేర్. ఇటీవల టెనెండ్ అనే మూవీతో పలకరించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.

నాకు భర్త కావాలి.. ఒంటరిగా ఉండాలని లేదు.. ఎస్తేర్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ పాత్రలతో మెప్పిస్తోన్న నటి ఎస్తేర్ నోరోన్హా. వెయ్యి అబద్దాలతో తెలుగులోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ.. సునీల్ సరనస భీమవరం బుల్లోడు చిత్రంలో నటించింది. ఆ రెండు ఆశించిన విజయం సాధించలేదు. దీంతో హీరోయిన్ కన్నా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి. వాటిని కూడా చాలెంజింగ్‌గా తీసుకుని తన నటనతో మెప్పిస్తోంది ఎస్తేర్. ఇటీవల కాలంలో బోల్డ్ అండ్ రఫ్ పాత్రలతో మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు హిందీ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉంటుంది. ఇటీవల టెనెండ్ అనే చిత్రంలో పవర్ ఫుల్ పోలీసు పాత్రలో మెప్పించింది. కాగా, 2019లో ప్రముఖ సింగర్ అండ్ ర్యాపర్ నోయెల్ సేన్‌ను వివాహం చేసుకోగా.. ఈ జంట 2020లో విడిపోయిన సంగతి విదితమే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తేర్.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటికే నోయల్‌తో జరిగిన పెళ్లి , విడాకులు గురించి పలు ఇంటర్వ్యూల్లో స్పందించిన ఆమె.. ఇప్పుడు తన సెకండ్ మ్యారేజ్ గురించిన విషయాలను వెల్లడించింది. ‘ నాకు ఒంటరిగా ఉండాలని లేదు. నాకు వివాహం చేసుకోవాలని ఉంది. ఓ అందమైన జీవితం కావాలనుకుంటున్నా. నాకు సరైన లైఫ్ పార్ట్‌నర్ కావాలి. అయితే ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలన్న దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే ఒకసారి పెళ్లి చేసుకొని చాలా సమస్యలను ఎదుర్కొన్నా. కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు అర్థం చేసుకునే వాడై ఉండాలి. షోకేస్ లాంటి మొగడు వద్దు’ అంటూ చెప్పుకొచ్చింది ఎస్తేర్.

ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నోయల్ నుండి విడిపోయిన తర్వాత.. వెండితెరపై రొమాంటిక్ అండ్ బోల్డ్ చిత్రాల్లో నటిస్తూ ట్రెండింగ్ లో నిలుస్తుంది ఎస్తేర్.  69 సంస్కార్ కాలనీలో ఒక టీనేజ్ కుర్రాడితో అక్రమ సంబంధాన్ని పెట్టుకునే మహిళగా నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత లోకల్ ట్రైన్, డీఎన్ఎ కన్నడ చిత్రాలతో పాటు రెక్కీ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇందులో కూడా గ్రామ పెద్దతో వివాహేతర సంబంధం పెట్టుకునే మహిళగా కనిపించింది. చాంగురే బంగారు రాజాతో పాటు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ చిత్రంలో యాక్ట్ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి