మార్కెట్లోకి ప్రభాస్ ‘కల్కి’ బుజ్జి ఈ-బైక్.. ధర ఎంతంటే?

Prabhas Kalki Bujji E-Bike: కల్కి సినిమాలో ప్రభాస్ నడిపిన బుజ్జి కారు ఎంత హైలైట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ కల్కి టీమ్ ఈ-బైక్ తయారీ కంపెనీతో కలిసి తీసుకొచ్చిన ఈ బుజ్జి బైక్ గురించి మీకు తెలుసా?

Prabhas Kalki Bujji E-Bike: కల్కి సినిమాలో ప్రభాస్ నడిపిన బుజ్జి కారు ఎంత హైలైట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ కల్కి టీమ్ ఈ-బైక్ తయారీ కంపెనీతో కలిసి తీసుకొచ్చిన ఈ బుజ్జి బైక్ గురించి మీకు తెలుసా?

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కి ఇంకా వారం రోజులే ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాగా హైలైట్ అయ్యింది ఏదైనా ఉంది అంటే అది భైరవ నడిపిన బుజ్జి కారే. ఆ కారుని నడపాలని ఫ్యాన్స్ కి ఉండే ఉంటుంది. అయితే ఆ బుజ్జి కారుని నడపలేకపోయినా బుజ్జి బైక్ ని నడిపే అవకాశం ఉంది. అవును మన దేశానికి చెందిన ఈమోటోరాడ్ అనే ఎలక్ట్రిక్ బైక్ తయారీ కంపెనీ కల్కి థీమ్ తో ఒక ఈ-బైక్ ని లాంఛ్ చేసింది. కల్కి టీమ్ తో కలిసి కల్కి థీమ్ తో డూడుల్ బైక్ ని తీసుకొచ్చింది. కల్కి టీమ్, ఈమోటారాడ్ కలయికలో ఈ బ్రాండ్ న్యూ ఈ-బైక్ వచ్చింది. అయితే లిమిటెడ్ ఎడిషన్ లో తీసుకొచ్చారు. ప్రభాస్ నటించిన కల్కి మూవీ థీమ్ ని జోడించి ఈ బైక్ ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇంకో విశేషం ఏంటంటే ఇది ఫోల్డబుల్ సైకిల్ గా వస్తుంది. మీరు దీన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళచ్చు. 

స్పెసిఫికేషన్స్:

  • బైక్ టైప్: ఫోల్డబుల్ ఫాట్ టైర్ ఈ-బైక్ 
  • ఫ్రేమ్: 16 అంగుళాల ఫోల్డబుల్ అల్యూమినియం అలాయ్ 6061 ఫ్రేమ్ 
  • ఫ్రంట్ ఫోర్క్: 60 ఎంఎం ట్రావెల్ విత్ లాకవుట్ 
  • బ్రేకులు: ఆటో కటాఫ్ తో మెకానికల్ డిస్క్ బ్రేక్స్ 
  • గేర్లు: షిమానో టోర్నీ టీజడ్500 7 స్పీడ్ 
  • టైర్: 20×4 నైలాన్ టైర్లు 
  • రిమ్: డబుల్ వాల్ అల్యూమినియం అలాయ్ రిమ్స్ 
  • మోటార్: ఈమోటోరాడ్ 36 వోల్ట్ 250 వాట్ రేర్ హబ్ మోటార్ 
  • బ్యాటరీ: 36 వోల్ట్ 12.75 ఏహెచ్ లిథియం అయాన్ రిమూవబుల్ బ్యాటరీ 
  • డిస్ప్లే: వాటర్ ప్రూఫ్ కవర్, ఇంటిగ్రేటెడ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్టుతో కూడిన ఈమోటోరాడ్ ఎం6హెచ్ ఎల్సీడీ డిస్ప్లే 
  • లైట్లు: ఇంటిగ్రేటెడ్ హారన్, వెనుక, ముందు రెండు ల లైట్లు 
  • ఛార్జర్: 2 యంపియర్స్ 
  • రేంజ్: థ్రోటిల్ మీద 45+ కి.మీ., పెడల్ అసిస్ట్ సిస్టమ్ (పీఏఎస్) మీద 60+ కి.మీ. 
  • ఛార్జింగ్ సమయం: 3 గంటల్లో 80 శాతం వరకూ ఎక్కుతుంది. 

ఈ బుజ్జి బైక్ ని మీరు టెస్ట్ రైడ్ చేయవచ్చు. 2,898 రూపాయలతో ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ బుజ్జి బైక్ ని మీరు టెస్ట్ రైడ్ చేయవచ్చు. 2,898 రూపాయలతో ప్రీ బుక్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 55,999గా ఉంది. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి స్టాక్ కూడా లిమిటెడ్ గానే ఉంది. మీరు గనుక ప్రభాస్ ఫ్యాన్స్ అయి ఉండి ఈ బైక్ నచ్చినట్లైతే వెంటనే ఆర్డర్ చేసుకోండి. కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments