iDreamPost
android-app
ios-app

సినిమాలు ఉండగా బెట్టింగ్ యాప్స్ అవసరమా శ్రద్ధా..?

  • Author ajaykrishna Published - 12:53 PM, Fri - 6 October 23
  • Author ajaykrishna Published - 12:53 PM, Fri - 6 October 23
సినిమాలు ఉండగా బెట్టింగ్ యాప్స్ అవసరమా శ్రద్ధా..?

ఈ మధ్యకాలంలో సినీతారలు సైతం ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ సినిమాలు చేసుకునే సినీ హీరోలు, హీరోయిన్స్ కి ఆల్రెడీ కమర్షియల్ యాడ్స్ ఎన్నో ఉంటాయి. అయినా బెట్టింగ్ యాప్స్ సైడ్ ప్రమోషన్స్ చేస్తున్నారంటే.. అందుకు కారణం డబ్బే అయ్యుండొచ్చు. ఒకవేళ డబ్బే కారణం అనుకుంటే.. వేరే బ్యూటీ ప్రోడక్ట్స్ లేదా రెగ్యులర్ చేసేవాటిలో కొత్త ప్రోడక్ట్స్ ఏవైనా చేసుకోవచ్చు. కానీ.. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కి సంబంధించి యాప్స్ ని ప్రమోట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తిప్పలు తప్పవు. ప్రస్తుతం బాలీవుడ్ లో అదే జరుగుతోంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ.. ఇప్పుడు కేసులలో ఇరుక్కుంటున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ నుండి మహాదేవ్ బెట్టింగ్ యాప్ కి సంబంధించి కేసులో చాలామంది స్టార్స్ కి ఈడి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారిలో స్టార్ హీరో రణబీర్ కపూర్ తో పాటు ప్రముఖ హోస్ట్ కపిల్ శర్మ, హీనా ఖాన్, హ్యూమా ఖురేషి ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి స్టార్ హీరోయిన్, సాహో ఫేమ్ శ్రద్ధా కపూర్ చేరింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ వివాదంలో శ్రద్ధా కపూర్ కి ఈడి సమన్లు జారీ చేసింది. అంతకుముందు రణబీర్ ఈడి ముందు హాజరు కావాలని నోటీసులు పంపగా.. తాను హాజరు అయ్యేందుకు రెండు వారాల గడువు కోరినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కపిల్ శర్మ, హీనా ఖాన్, హ్యూమా లకు కూడా ఈడి వేర్వేరు తేదీలలో మీట్ అవ్వాలని నోటీసులు పంపించింది.

ఇక వారందరు రెండు వారాల గడువు కోరినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో వీరందరిని నిందితులుగా ఖరారు చేయనప్పటికి.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు గాను తీసుకున్న చెల్లింపుల గురించి మాత్రమే చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాగా.. స్టార్ హీరో అయిన రణబీర్.. ఈ యాప్ ని ప్రమోట్ చేయడానికి భారీ మొత్తం తీసుకున్నట్లు ఈడి పేర్కొంది. ఇదిలా ఉండగా.. చక్కగా సినిమాలు, కమర్షియల్ యాడ్స్ చేసుకుంటున్న శ్రద్ధా.. ఇప్పుడు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో పాల్గొందని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి ఈ వివాదంలో శ్రద్ధా ఈడి ముందు ఇవాళే హాజరు కావాల్సి ఉంది. సో.. బ్యూటీ హాజరు అవుతుందా లేదా? తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం.. సినిమాలు ఉండగా ఇవన్నీ అవసరమా శ్రద్ధా? అని కామెంట్స్ చేస్తున్నారు. మరి శ్రద్ధా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş