iDreamPost

మంత్ ఆఫ్ మధు మూవీ రివ్యూ!

మంత్ ఆఫ్ మధు మూవీ రివ్యూ!

టాలీవుడ్ లో కొత్త కథలను ప్రేక్షకులు స్వాగతిస్తున్న సంగతి తెలిసిందే. రొట్టకొట్టుడు కథలకు బ్రేక్ చెప్పి చాలా కాలమైంది. స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు కొత్త కథలు, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో వస్తున్న సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో నవీన్ చంద్ర ఒకరు. ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు వేరే సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. నవీన్ చంద్ర హీరోగా.. కలర్స్ స్వాతి, శ్రేయ నవీలే హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చిన మంత్ ఆఫ్ మధు.. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

కథ:

ఈ కథ వైజాగ్ లో మొదలవుతుంది. మధుసూదన్ రావు(నవీన్ చంద్ర), అతని భార్య లేఖ(స్వాతి రెడ్డి), మధు(శ్రేయ నవీలే).. ఈ మూడు క్యారెక్టర్స్ చుట్టూ కథ సాగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోల్పోయి.. విడాకుల కోసం అప్లై చేసిన భార్య లేఖ ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఎదురుచూస్తుంటాడు మధుసూదన్. ఈ క్రమంలో మద్యానికి బానిస అవుతాడు. కట్ చేస్తే.. మధుసూదన్ కి మధు అనే అమ్మాయి పరిచయం అవుతుంది. బంధువుల ఇంటికి అమెరికా నుండి వచ్చిన మధుకి, మధుసూదన్ ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. మరి మధుకి ఫ్లాష్ బ్యాక్ ఎలా తెలిసింది? మధుసూదన్ భార్య ఎందుకు విడాకులు కోరుకుంటుంది? మధుసూదన్ గవర్నమెంట్ జాబ్ ఎందుకు పోయింది? మధు వచ్చాక మధుసూదన్ లైఫ్ లో ఏమైంది? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

టాలీవుడ్ లో లైఫ్ స్టోరీస్ ని చూపించడం చాలా అరుదు. అప్పుడెప్పుడో నా ఆటోగ్రాఫ్, లేతమనసులు, మజిలీ లాంటి సినిమాలు కొన్ని చూశాం. ఇంకా చాలానే ఉన్నాయి. కానీ.. వేరే కంట్రీ నుండి వచ్చి.. ఇక్కడ స్టే చేసి వెళ్లిన వాళ్ల జర్నీని చూపించడం రేర్ గా జరిగింది. అంటే.. సినిమాలో ఓ విదేశీ క్యారెక్టర్ లా కాసేపు పొట్రే చేశారే గానీ.. ఫుల్ గా ఆ విదేశీ క్యారెక్టర్ జర్నీ చూపించలేదు. సో.. ఈ మంత్ ఆఫ్ మధు అనేది అలాంటి ప్రయత్నమే. ఆల్రెడీ వైజాగ్ లో స్ట్రగుల్ అవుతున్న దంపతులు ఓవైపు.. ఒక నెల రోజులు ఉండిపోదాం అని వచ్చిన మోడరన్ అమ్మాయి మరోవైపు.. ఆమె ఉన్న నెల రోజులలో ఏం జరిగింది? అనేది సినిమాగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

ట్రైలర్ చూసినప్పుడు.. చాలా నేచురల్ డైలాగ్స్, ఎమోషన్స్ తో మంత్ ఆఫ్ మధు ఆకట్టుకుంది. దీంతో చాలా సినిమాలకు పోటీగా వస్తున్నా.. సినిమాపై కాస్తో కూస్తో ఇంటరెస్ట్ ఏర్పడింది. అసలు అమెరికా అమ్మాయి మధు వైజాగ్ వచ్చాక ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసింది? మధ్యలో మధుసూదన్, లేఖ దంపతుల ప్రాబ్లెమ్ ఏంటి? అనే ప్రశ్నలు ట్రైలర్ చూశాక ఆసక్తి కలిగించాయి. మరి సినిమా విషయానికి వస్తే.. మధుసూదన్ రావు(నవీన్) క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ సినిమా మొదలైంది. అందులోనూ మద్యానికి బానిసైన మధుసూదన్ ని కొందరు వ్యక్తులు బార్ లో చావగొట్టే సీన్ తో స్టార్ట్ అయ్యింది. కట్ చేస్తే.. మధుసూదన్ క్యారెక్టర్ వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్.

మధుసూదన్ చాలా యంగ్ గా ఉన్నప్పుడు.. 2003 టైమ్ లో లవ్ స్టోరీ చూపించారు. ఆ లవ్ స్టోరీలో మధుసూదన్ భార్య లేఖ కూడా ఉంటుంది. ఇద్దరు కాలేజీలో లవ్ చేసుకుంటారు. కుర్రతనంలో తెలియకుండా ఓ తప్పు చేస్తారు.. ఆ తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఏం జరిగింది? వీళ్ళు ఏం చేశారు? అంటూ కథలోకి తీసుకెళ్తూనే.. ప్రధాన పాత్రలను పరిచయం చేశాడు దర్శకుడు. సినిమాని చాలా నేచురల్ వేలో ప్రెజెంట్. చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇరవై ఏళ్ల క్రితం వైజాగ్ పరిస్థితులు, వాతావరణం ఎలా ఉండేదో చక్కగా చూపించారు. అయితే.. అసలు కథను మొదలు పెట్టడానికి మాత్రం చాలా టైమ్ తీసుకున్నాడు డైరెక్టర్.

సినిమాలో క్యారెక్టర్స్ కి మధ్య ఎమోషన్స్ గట్టిగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు పడలేదు. లీడ్ క్యారెక్టర్స్ విడిపోవడం.. మళ్ళీ కలవాలని అనుకోవడం.. మధ్యలో మధు ఎంటర్ అవ్వడం ఇలా చాలా పాయింట్స్ ఉన్నప్పటికీ.. ఎక్కడా కథతో జర్నీ చేసే ఫీల్ కలగలేదు. అయితే.. సెకండాఫ్ లో అమెరికా నుండి వచ్చిన మధు క్యారెక్టర్ ఎంటర్ అవ్వడంతో కథలో కాస్త ఇంటరెస్ట్ కలుగుతుంది. ఎందుకంటే.. అమెరికా నుండి వచ్చి.. ఇక్కడి వాళ్లతో ఇమడలేక ఇబ్బంది పడుతుంటుంది. మొత్తానికి వచ్చి రాని తెలుగులో బాగానే మాట్లాడుతూ.. అందరితో ఇట్టే కలిసిపోతుంది. అలా మధుసూదన్ తో పరిచయం.. అక్కడినుండి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం.. మధు నెల రోజులు ఎలా గడిపింది? ఆమె వల్ల మధుసూదన్ కి ఏమైనా మేలు జరిగిందా లేదా సెకండాఫ్ లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం జరిగింది.

ఇక ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఇంటరెస్టింగ్ గా ఉన్నా.. అందరు కనెక్ట్ అవుతారని చెప్పలేం. సినిమాలో ఎక్కువ డ్రామా ఉండటం కాస్త ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఇబ్బంది కలిగించవచ్చు. బట్.. లైఫ్ లో ఎక్కడో చోట కథలో ఏదొక పాయింట్ దగ్గర ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ కొందరికి తృప్తిని ఇవ్వకపోవచ్చు. పెద్దగా ట్విస్టులు లేకుండా.. డ్రామా, ఎమోషన్స్ తో సాగింది మధు జర్నీ. ఇక మధుసూదన్ క్యారెక్టర్ లో నవీన్, లేఖ క్యారెక్టర్ లో స్వాతి ఆకట్టుకున్నారు. శ్రేయ నవీలే కొత్తగా ఉంది. కానీ.. ఆమె క్యారెక్టర్ కి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. మంజుల, వైవా హర్ష క్యారెక్టర్స్ బాగున్నాయి. మిగతా వాళ్లంతా ఓకే. టెక్నికల్ గా.. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కుదిరాయి. సాంగ్స్ అంత ఎఫెక్టీవ్ గా అనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ లు:

  • లీడ్ క్యారెక్టర్స్
  • కెమెరా వర్క్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • అక్కడక్కడా డైలాగ్స్

మైనస్ లు:

  • ఎక్కువ డ్రామా
  • ఎమోషన్స్ మిస్ అవ్వడం
  • వీక్ రైటింగ్

చివరిమాట: కొందరికే నచ్చుతుంది!

రేటింగ్: 2/5

(ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి