iDreamPost
android-app
ios-app

సలార్ మూవీలో మరో స్పెషల్ అట్రాక్షన్! మాస్ రాజా టచ్!

సలార్‌ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్‌ 22వ తేదీన విడుదల కానుంది. విడుదలకు ముందు సినిమా టీం ఓ పాటను, సెకండ్‌ ట్రైలర్‌ను విడుదల చేయనుంది...

సలార్‌ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్‌ 22వ తేదీన విడుదల కానుంది. విడుదలకు ముందు సినిమా టీం ఓ పాటను, సెకండ్‌ ట్రైలర్‌ను విడుదల చేయనుంది...

సలార్ మూవీలో మరో స్పెషల్ అట్రాక్షన్! మాస్ రాజా టచ్!

యావత్‌ దేశం ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సలార్‌’ సినిమా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్‌ 22వ తేదీనుంచి సలార్‌ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మూవీపై అంచనాలను పెంచేసింది. యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో.. 24 గంటల్లోనే 100 మిలియన్ల మార్కును చేరుకుంది. పాత రికార్డులను తుడిచిపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే సలార్‌ టీం ప్రమోషన్ల విషయాన్ని లైట్‌ తీసుకుంది.

పెద్దగా ప్రమోషన్లు చేయకుండానే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తోంది. సలార్‌ విడుదలకు ముందు ఓ పాట, సెకండ్‌ ట్రైలర్‌ విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ రోజు ఈ చిత్రంలోని పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని రోజుల గ్యాప్‌ తర్వాత సెకండ్‌ ట్రైలర్‌ విడుదల కానుంది. సలార్‌ టీం కేవలం ప్రభాస్‌ స్టామినాను నమ్ముకుని ముందుకు వెళుతోంది. అందుకే ప్రమోషన్లు కూడా చేయటం లేదు. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో ప్రభాస్‌ సత్తా చాటుతాడన్న నమ్మకంతోనే టీం గట్టి నిర్ణయం తీసుకుంది.

eagel trailer in salar movie

ఇక, తెలుగునాట సలార్‌ సినిమా ఆడే థియేటర్లలో మాస్‌ మహారాజా రవితేజ సందడి చేయనున్నారు. అంటే.. ఆయన థియేటర్లకు వెళతారని కాదు.. సలార్‌ మూవీ ఆడే థియేటర్లలో రవితేజ తాజా చిత్రం ‘‘ ఈగల్‌’’ సందడి చేయనుంది. సలార్‌ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఈగల్‌’ చిత్ర  బృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కచ్చితంగా ఈగల్‌ ప్రమోషన్‌కు బాగా ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి రీచ్‌ అవుతుంది.

కాగా, రవితేజ ‘ఈగల్‌’ సినిమా జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే, ఇదే సమయంలో మహేష్‌ బాబు ‘గుంటూరుకారం’.. వెంకటేష్‌ ‘సైంధవ్‌’, నాగార్జున ‘ నా సామిరంగ’.. ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ హానుమాన్‌’ రిలీజ్‌ అవుతున్నాయి. వీటి ఎఫెక్ట్‌ కచ్చితంగా ఈ మూవీపై పడనుంది. థియేటర్ల విషయంలోనూ..కలెక్షన్ల విషయంలోనూ ఈగల్‌కు కష్టాలు తప్పవు. ఈగల్‌ నిర్మాతలు తీసుకున్న నిర్ణయం రవితేజకు ఇబ్బందిగా మారుతోంది.

రవితేజ ఫస్ట్‌ డే కలెక్షన్ల విషయంలో చాలా వెనుకబడి ఉన్నాడు. రీసెంట్‌ సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల అయినా.. ఓపెనింగ్‌ కలెక్షన్ల విషయంలో సత్తాచాట లేకపోయింది. రవితేజ నెంబర్‌ రేసులో వెనుకబడుతూ వస్తున్నారు. ఈగల్‌తోనైనా ఈ ఫీట్‌ సాధిస్తాడనుకుంటే.. అదీ కుదిరేలా లేదు. ఈగల్‌ నిర్మాతలు కొంచెం ఆలోచించి.. జనవరి నుంచి పక్కకు వస్తే.. కలెక్షన్ల విషయంలో సేఫ్‌ అవుతారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి, సలార్‌ సినిమా ఆడే థియేటర్లలో ఈగల్‌ ట్రైలర్‌ సందడి చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.