iDreamPost
android-app
ios-app

డంకీ డే-1 vs సలార్ డే-1.. పస్ట్ డే కలెక్షన్స్ లో తోపు ఎవరంటే?

  • Published Dec 22, 2023 | 9:58 PM Updated Updated Dec 22, 2023 | 9:58 PM

Dunki Day 1 vs Salaar Day 1 Collections: సలార్ సినిమా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేస్తోంది. ఇప్పటికే డే 1 కలెక్షన్స్ ఎంత అనే అంశం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

Dunki Day 1 vs Salaar Day 1 Collections: సలార్ సినిమా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేస్తోంది. ఇప్పటికే డే 1 కలెక్షన్స్ ఎంత అనే అంశం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

  • Published Dec 22, 2023 | 9:58 PMUpdated Dec 22, 2023 | 9:58 PM
డంకీ డే-1 vs సలార్ డే-1.. పస్ట్ డే కలెక్షన్స్ లో తోపు ఎవరంటే?

పాన్ ఇండియా లెవల్లో ఒక పెద్ద బాక్సాఫీస్ యుద్ధం జరుగుతోంది. బాలీవుడ్ బాద్షా షారుక్ నటించిన డంకీ.. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా మధ్య ఇప్పుడు బాక్సాఫీస్ క్లాష్ నడుస్తోంది. అయితే ఈ యుద్ధం దాదాపుగా వన్ సైడ్ అయ్యిందనే చెప్పాలి. నిజానికి సలార్ చిత్రం రిలీజ్ కి ముందే డంకీ దుకాణం సర్దేసుకుంది. డంకీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కాస్తో కూస్తో పోటీ ఉండేదేమో.. కానీ, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదనే చెప్పాలి. ఇంక డే1 కలెక్షన్స్ విషయంలో డంకీ- సలార్ మధ్య అస్సలు కంపారిజన్ కూడా లేకుండా పోయింది.

డంకీ సినిమా విడుదల సమయంలో సలార్ సినిమా వస్తోందని ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. బాలీవుడ్ లో సలారోడికి గట్టి పోటీ ఉంటుందని.. కలెక్షన్స్ విషయంలో కంగారు పడాల్సి వస్తుందని భావించారు. కానీ, బొమ్మ రివర్స్ అయ్యింది. డంకీకి కేటాయించిన స్క్రీన్స్ కూడా ఇప్పుడు సలార్ కి ఇచ్చేసే పరిస్థితి కనిపిస్తోంది. డంకీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుని డీలా పడగా.. సలార్ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ మీద దండయాత్ర ప్రారంభించేసింది. ఈ నేపథ్యంలోనే అసలు డంకీ డే1 కలెక్షన్స్ ఎంత? సలార్ డే-1 కలెక్షన్స్ ఎంత? అసలు ఈ రెండు చిత్రాల్లో ఏది టాప్ ప్లేస్ లో నిలిచింది? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

షారుక్ ఖాన్ డంకీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. వరల్డ్ వైడ్ గా రూ.98 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే సలార్ సినిమా మాత్రం అందుకు 60 నుంచి 70 శాతం అదనంగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. సలార్ సినిమా అడ్వాన్స్డ్ బుకింగ్సే రూ.60 కోట్లు దాటినట్లు ఇప్పటికే బయటకొచ్చింది. ఇంక ఫస్ట్ కలెక్షన్స్ గురించి కూడా ఓ అంచనాకు వచ్చేశారు. సలార్ సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రోజు రూ.175 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ ఇయర్ లో అత్యధిక ఫస్ట్ డే గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మరికొన్ని గంటల్లో సలార్ పేరు అధికారింగా అనౌన్స్ చేస్తారు. ఇంక ఫస్ట్ డేలో రూ.175 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందనే టాక్ ని చాలామంది బీటౌన్ వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆదివారం వరకు సలార్ సినిమాకు టికెట్స్ బుక్ అయిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు పాన్ ఇండియా లెవల్లో డంకీ స్క్రీన్స్ లో చాలావరకు సలార్ మూవీకి రానున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే సలార్ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రభాస్ కి ఇలాంటి సరైన సినిమా పడి ఆరేళ్లు అవుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తోంది. యాక్షన్స్ సీక్వెన్స్, పాజిటివ్ టాక్ చూస్తే రిపీటేడ్ ఆడియన్స్ కూడా ఉంటారు. కాబట్టి ప్రభాస్- ప్రశాంత్ నీల్ కెరీర్లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. డంకీ డే1 కలెక్షన్స్ ని సలార్ సినిమా సునాయాసంగా క్రాస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio