iDreamPost
android-app
ios-app

సలార్‌కు ఆ సినిమాల దెబ్బ.. ఆ రికార్డు కష్టమే..

సలార్‌ సినిమా విడుదలకు కేవలం పది రోజుల మాత్రమే ఉంది. ఇప్పటికే అమెరికాలో ప్రీ బుకింగ్స్‌ విషయంలో సలార్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఏకంగా 5 కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడయ్యాయి.

సలార్‌ సినిమా విడుదలకు కేవలం పది రోజుల మాత్రమే ఉంది. ఇప్పటికే అమెరికాలో ప్రీ బుకింగ్స్‌ విషయంలో సలార్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఏకంగా 5 కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడయ్యాయి.

సలార్‌కు ఆ సినిమాల దెబ్బ.. ఆ రికార్డు కష్టమే..

సలార్‌ సినిమా రికార్డుల వేట మొదలెట్టడానికి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. డిసెంబర్‌ 22వ తేదీన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అవ్వనుంది. ట్రైలర్‌తోటే పాత రికార్డులు బద్దలయ్యాయి. ప్రశాంత్‌ నీల్‌ పాత చిత్రం కేజీఎఫ్‌ 2 చిత్రంపై ఉన్న రికార్డును సలార్‌ తుడిచి పెట్టేసింది. కేజీఎఫ్‌ 24 గంటల్లో యూట్యూబ్‌లో 100 మిలియన్ల మార్కును చేరుకుంది. కానీ, సలార్‌ మాత్రం కేవలం 18 గంటల్లోనే ఈ రికార్డును సాధించింది.

అయితే, ఓ రికార్డు విషయంలో మాత్రం సలార్‌కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ప్రభాస్‌ పాత సినిమాలు ‘సాహో, ఆదిపురుష్‌’ సాధించిన ఫీట్‌ను సలార్‌ సాధించలేదన్న టాక్‌ వినిపిస్తోంది. ఇంతకీ సంగతేంటంటే.. సాహో, ఆదిపురుష్‌ చిత్రాలు హైదరాబాద్‌ సిటీలో మొదటి రోజు 1000కి పైగా షోలను సొంతం చేసుకున్నాయి. సలార్‌కు మాత్రం 1000 షోలకు అవకాశం దొరికేలా కనిపించటం లేదు. ఎందుకంటే.. ఓ రోజు అటు, ఇటుగా డంకీ, ఆక్వామ్యాన్‌ 2 మూవీలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ రెండు సినిమాలు దాదాపు హైదరాబాద్‌లోని 40 శాతం షోలను ఆక్రమించినట్లుగా తెలుస్తోంది. దీంతో మొదటి రోజు షోల విషయంలో ప్రభాస్‌ తన పాత సినిమాల రికార్డును కూడా బ్రేక్‌ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, సలార్‌ టీం ప్రమోషన్ల విషయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకుందట. ప్రమోషన్లకు దూరంగా ఉండాలని భావిస్తోందట. విడుదలకు ముందు ఓ పాట, సెకండ్‌ ట్రైలర్‌, ఇంగ్లీష్‌లో సినిమా టీం ఇంటర్వ్యూల తప్ప ఏమీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చిందట.

అయితే, ప్రమోషన్లు లేకపోయినా సలార్‌ సత్తా చాటే అవకాశం ఉంది. ఎందుకంటే.. అక్కడ ఉన్నది ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌. కేవలం ప్రభాస్‌ కటౌట్‌ చాలు సినిమా హాలుకు జనాన్ని రప్పించడానికి. దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్‌ మొదటి రోజు క్యూ కడతారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి తోడు కేజీఎఫ్‌ చిత్రాలతో దేశ వ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌ కూడా ప్లస్‌ కానున్నాడు. వీర్దిదరి కారణంగా సినిమాకు జనం వస్తారు.

కథ బాగుంటే.. జనాన్ని మెప్పించగలిగితే కలెక్షన్ల వరద కాదు.. సునామీ వస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక, సలార్‌ ప్రీ బుకింగ్స్‌ విషయంలో అమెరికాలో రికార్డు క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు ఏకంగా దాదాపు 5 కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడుపోయాయి. మరి, డంకీ, ఆక్వామ్యాన్‌ సినిమాల కారణంగా సలార్‌ సినిమా రికార్డుకు బ్రేక్‌ పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.