తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది సీతారామం సినిమాతో తెలుగు వాడిగా బాగా దగ్గరైపోయాడు. అంతకుముందు మహానటి బయోపిక్ తో పరిచయం అయినప్పటికీ.. సోలో హీరోగా డెబ్యూ చేసింది ‘సీతారామం’తోనే. అయితే.. వీటన్నిటికంటే ముందు దుల్కర్ చేసిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అవుతూ రిలీజ్ అయ్యాయి. డబ్బింగ్ సినిమాలుగా.. మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ జనాలలో దుల్కర్ ఫేస్ పెద్దగా ప్రింట్ అవ్వలేదు. దీంతో మహానటి తర్వాత.. స్ట్రెయిట్ తెలుగు మూవీ సీతారామం చేసి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను నవ్వించి.. చివరిలో ఏడిపించేసాడు.
ఇంకేముంది.. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా బిగ్ ఫ్యాన్స్ అయిపోయారు. అందులోనూ దుల్కర్ సినిమాలన్ని ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. అతని స్టోరీ సెలక్షన్.. డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని రకాల క్యారెక్టర్స్ కి న్యాయం చేయగలడని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అయితే.. ఇప్పుడు ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో తన కొత్త సినిమా రిలీజ్ చేయబోతున్నాడు. ‘కింగ్ ఆఫ్ కొత్త’ అనే టైటిల్ తో యాక్షన్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. డైరెక్టర్ అభిలాష్ జోషి ఈ మూవీ రూపొందించాడు. ఇప్పటికే ప్రమోషన్స్ గట్టిగా జరుపుకున్న ఈ సినిమా ఆగష్టు 24న రిలీజ్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. కింగ్ ఆఫ్ కొత్త మూవీకి వేరే భాషలలో క్రేజ్ ఎలా ఉన్నప్పటికీ.. తెలుగులో మాత్రం గట్టిగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే.. సీతారామం తర్వాత జనాలు దుల్కర్ సినిమాలు చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఇందులో మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు దుల్కర్. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే.. తెలుగులో కింగ్ ఆఫ్ కొత్తకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా దాదాపు రూ. 5 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుందట. అంటే.. రూ. 5.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక సినిమాకు బజ్ ఎలాగో ఉంది కాబట్టి.. హిట్ టాక్ వస్తే టార్గెట్ అంత కష్టమేమి కాదేమో మరి! కింగ్ ఆఫ్ కొత్త గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.