iDreamPost
android-app
ios-app

విక్రమ్ లో సూర్య రోలెక్స్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఇతనే?

Vikram Movie Rolex Character: విక్రమ్ సినిమాలో కనిపించింది జస్ట్ కొన్ని నిమిషాలు.. అయినా థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశాడు నటుడు సూర్య. ఈ సినిమాలో రోలెక్స్ క్యారెక్ట్ పాత్ర ఓ రేంజ్ లో పేలింది. మరి.. ఆ రోలెక్స్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరంటే..

Vikram Movie Rolex Character: విక్రమ్ సినిమాలో కనిపించింది జస్ట్ కొన్ని నిమిషాలు.. అయినా థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశాడు నటుడు సూర్య. ఈ సినిమాలో రోలెక్స్ క్యారెక్ట్ పాత్ర ఓ రేంజ్ లో పేలింది. మరి.. ఆ రోలెక్స్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరంటే..

విక్రమ్ లో సూర్య రోలెక్స్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఇతనే?

సినీ ఇండస్ట్రీ అనేది చాలా విభాగాలతో కూడిన పరిశ్రమ. ఇక్కడ మనకు తెరపై కనిపించేది కేవలం కొందరు మాత్రమే. అయితే తెరవెనుక కూడా శ్రమించే వారు చాలా మంది ఉంటారు. అలాంటి ఎందరో కృషి ఫలితంగానే సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఇలా సినిమాల్లో కీలక పాత్ర పోషించే వారిలో డబ్బింగ్ ఆర్టిస్టులు ప్రధానం. విలన్, హీరో, హీరోయిన్లకు వీళ్లు ఇచ్చే వాయిసే ప్రాణం పోస్తుంది. హీరో, విలన్ల విషయంలో పాత్రకు సూట్ అయ్యే  వాయిస్ అందిస్తే.. ఆ  సినిమా హిట్ అవుతుంది. హీరోలకు డబ్బింగ్ చెప్పింది ఎవరా అని తెలుసుకునేందుకు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలానే కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో  సూర్య చేసిన రోలెక్స్ పాత్ర అందరికి గుర్తుండే ఉంటుంది. దానికి సంబంధించిన ఓ న్యూస్ మీ కోసం.

ఇటీవల కాలంలో గట్టిగా వినిపించిన సినిమాల పేర్లలో విక్రమ్. చాలా కాలం తరువాత లోక నాయకుడు కమల్ హాసన్  విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా హిట్స్ లేక సతమతం అవుతున్న కమల్ కి విక్రమ్ మంచి బూస్ట్ ఇచ్చింది. యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగ రాజ్ దర్శకత్వంలో  విక్రమ్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఉహించిన దానికంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో లోకేష్  డైరెక్షన్ మాత్రమే కాకుండా చివరి ఐదు నిమిషాల్లో వచ్చిన సీన్ మరింత హైలెట్‏గా నిలిచింది. రోలెక్స్ క్యారెక్టర్ ఎంట్రీతో థియేటర్లలో ఒక్కసారిగా ప్రేక్షకులు రచ్చ చేశారు.

surya rolex dubbing

రోలెక్స్ అంటూ అరుపులతో నానా హంగామా చేశారు. కేవలం ఐదు నిమిషాలు ఉన్న ఈ సీన్.. సినిమా మొత్తానికి కావాల్సిన స్టఫ్ అందించింది. కేవలం రోలెక్స్ పాత్ర ద్వారా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుందంటే అతిశయోక్తి కాదు. ఈ రోలెక్స్ పాత్రలో సూర్య నటించిన సంగతి తెలిసిందే. అయితే సూర్య రోలెక్స్ పాత్రకి వాయిస్ ప్రాణం పోసింది. ఆ వాయిస్ ఎవరిదా అని తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. సూర్య రోలెక్స్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది రమేష్ అనే డబ్బింగ్ ఆర్టిస్.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని విక్రమ్ మూవీతో పాటు అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. రోలెక్స్ అద్భుతమైన పాత్ర. ఈ వాయిస్ ను ఎంతో డెడికెటెడ్ గా చెప్పాను. ఆ పాత్ర వాయిస్ కోసం చాలా సమయం తీసుకున్నాను. మాములుగా ఏ సినిమాలోనూ నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ.. విక్రమ్ సినిమాలోని రోలెక్స్ పాత్ర కోసం మాత్రం చాలా కృషి చేశానని తెలిపారు. ఆ పాత్రకు డబ్బింగ్ ఇచ్చేందుకు ప్రాణం పెట్టి వర్క్ చేశానని ఆయన తెలిపారు. అలా శిల్పం చెక్కినట్లు వాయిస్ లో బెటర్ గా అందించాం కాబట్టే.. రోలెక్స్ పాత్ర సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు.

ఇక డబ్బింగ్ ఆర్టీస్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూర్య సన్ ఆఫ్ కృష్ణ అనే సినిమాతో సూర్యకు డబ్బింగ్ చెప్పారు. ఆ తరువాత అనేక సినిమాల్లో హీరోలకు డబ్బింగ్ ఇచ్చారు. ఇక విక్రమ్ సినిమాతో రమేశ్ కు ఫుల్ గుర్తింపు వచ్చింది. ఆయన అందించిన వాయిస్ కి థియేటర్ల విజిల్స్ పడ్డాయి. చివరి విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్ర ఓ రేంజ్  లో పేలింది. రగ్గడ్ లుక్, రక్తపాతంతో టెర్రిఫిక్ విలనిజం పండించాడు సూర్య.  చేసింది కామియో అయినా మంచి ఇంపాక్ట్ చూపించింది. ఈ సినిమాలో సూర్య నటనతో పాటు రమేష్ వాయిస్ రోలెక్స్ పాత్రను  ఓ రేంజ్ లో నిలబెట్టింది.  మరి.. విక్రమ్ సినిమాలో రెలెక్స్ క్యారెక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.