Dharani
Ram-Weight Loss Journey: డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ సందర్భంగా హీరో రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
Ram-Weight Loss Journey: డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ సందర్భంగా హీరో రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
Dharani
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ చిత్రం మీద అంచనాలను భారీగా పెంచాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. మూవీ టీమ్ ప్రమోషన్స్ వర్క్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా రామ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయ
తన ఫ్యాన్స్ ఎవరూ తనలా చేయవద్దని కోరాడు. ఇంతకు రామ్ ఏ విసయంలో ఇలాంటి సూచన చేశాడంటే.. బరువు తగ్గడం గురించి. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ముందు.. రామ్ స్కంద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ కండలు తిరిగిన బాడీతో కనిపించాడు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాలో తన లుక్ చూసి షాక్ అయ్యారు. ఇంత తక్కువ గ్యాప్ లో ఇంత స్లిమ్ గా ఎలా మారాడు.. ఇదెలా సాధ్యమైంది అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
వీటన్నిటికీ సమాధానంగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ షేర్ చేశాడు రామ్. వీటిల్లో తను తన తాజా లుక్ కోసం జిమ్, స్టీమ్ సెషన్ లు తీసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాక డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో భాగంగా గెటప్ శ్రీనుతో ఇంటర్వ్యూ లో హీరో రామ్ తన లుక్ కు సంబంధించి మరి కొన్ని విషయాలు పంచుకున్నారు. స్కంద పూర్తయ్యేసరికి 86 కిలోల బరువు ఉన్న రామ్, డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వచ్చేసరికి 68 కిలోలకు తగ్గినట్లు చెప్పుకొచ్చాడు.
దీని గురించి రామ్ మాట్లాడుతూ ”పూరి జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ కిక్ ఇచ్చింది. ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్ లాగే డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ లో కూడా షర్ట్ లేకుండా చేయాలని అనుకున్నాం. ఆ క్లైమాక్స్ పార్ట్ నవంబర్ లోనే షూట్ చేయాలి. స్కంద రిలీజైన తర్వాత నాకు 2 నెలలు మాత్రమే టైమ్ ఉంది. దాంతో వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెల రోజులుండి తీవ్రంగా వర్కవుట్ చేసి బరువు తగ్గాను” అని తెలిపాడు. అయితే ఇలా తక్కువ టైమ్ లో బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదకరమని, తనలా ఎవ్వరూ ప్రయత్నించొద్దని కూడా సూచించాడు రామ్.