iDreamPost
android-app
ios-app

కళ్యాణ్ రామ్ కి ఈ రిస్క్ అవసరమా? ఇది మొండి ధైర్యమే!

బింబిసారతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన కళ్యాణ్ రామ్.. అమిగోస్ ఆశించిన విజయాన్ని సాధించలేదు. మళ్లీ పీరియాడిక్ డ్రామానే నమ్ముకున్నాడు. డెవిల్ అంటూ రాబోతున్నాడు. అయితే రిస్కు తీసుకుంటున్నాడు. తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో మూవీని విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్

బింబిసారతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన కళ్యాణ్ రామ్.. అమిగోస్ ఆశించిన విజయాన్ని సాధించలేదు. మళ్లీ పీరియాడిక్ డ్రామానే నమ్ముకున్నాడు. డెవిల్ అంటూ రాబోతున్నాడు. అయితే రిస్కు తీసుకుంటున్నాడు. తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో మూవీని విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్

కళ్యాణ్ రామ్ కి ఈ రిస్క్ అవసరమా? ఇది మొండి ధైర్యమే!

ఒకప్పుడు సినిమాకు అసలైన పండుగ అంటే సంక్రాంతి అనే భావించారు. కానీ ఇప్పుడు క్రిస్‌మస్ నుండే మొదలౌతుంది. ఈ ఏడాది కూడా ఈ సీజన్‌లో రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి దూసుకువస్తున్నాయి. ఒకటి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ డంకీ, మరోటి డార్లింగ్ ప్రభాస్-ది సీజ్ ఫైర్. సలార్ పాన్ ఇండియన్ మూవీగా రాబోతున్న సంగతి విదితమే. డిసెంబర్ 21న డంకీ, 22న సలార్ విడుదలౌతున్నాయి. ఈ రెండు భారీ కలెక్షన్లను టార్గెట్ పెట్టుకున్నాయి. ఈ మూవీలకు దడిచే చాలా మంది హీరోలు.. తమ సినిమా విడుదల తేదీలను ముందుకు జరుపుకోవడమే లేదంటే వచ్చే ఏడాదికి మార్చుకున్నారు. కానీ ఈ సమయంలో రిస్క్ చేసేందుకు వస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్.

కళ్యాణ్ రామ్ డెవిల్‌గా రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో అడుగుపెట్టబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఈ డిసెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఎందుకంటే.. ఈ క్రిస్‌మస్, న్యూఇయర్ మొత్తం డంకీ, సలార్ హవానే నడుస్తుంది అనుకున్నారు. ఈ సమయంలోనే డెవిల్ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ నందమూరి వారసుడు. ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. రెండు బుల్డోజర్లలాంటి సినిమాల మధ్య ఈ మూవీ అవసరమా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. అసలే ఈ మూవీని సుమారు 50 కోట్ల పెట్టి తెరకెక్కించాడు అభిషేక్ నామా. అతడే దర్శకుడు కూడా.

ఈ భారీ చిత్రాల విడుదల ఉన్నాయనే.. ఆ తీవ్రమైన పోటీ తట్టుకోలేకే నాని లాంటి సక్సెస్ హీరోలే హాయ్ నాన్న మూవీని అనుకున్న రిలీజ్ డేట్ కన్నా ముందే థియేటర్లలోకి తీసుకు వచ్చారు. అలాగే సంక్రాంతి వరకు కూడా పెద్ద సినిమాలు ఏమీ లేవు. అంటే అటు రెండు వారాలు, ఇటు రెండు వారాలు డంకీ, సలార్ మూవీస్ మేనియా నడవనుంది. ఈ సమయంలో ఏ మూవీ విడుదల చేసినా.. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. పత్తా లేకుండా పోవడం ఖాయమని అనుకుంటున్నారు.  కానీ డెవిల్ ఉన్నపళంగా డిసెంబర్ 29న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసుకుంది. అంటే సలార్ రిలీజ్ అయిన వారం రోజులకే బాక్సాఫీస్ బరిలోకి వచ్చేస్తోంది. మరీ ఏ ధైర్యంతో ఈ పిక్చర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందో అర్థం కావడం లేదు. రెండు మూవీలు బెడిసి కొడితే.. ఈ మూవీపై కలెక్షన్ల వర్షం కురుస్తుందన్న కాన్ఫిడెంట్‌తో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రిస్క్ చేసి మరీ డెవిల్ విడుదల చేయడం వెనుక ఉద్దేశమేమిటో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.