iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న మల్టీ టాలెండెట్ నటుడు ఎవరో గుర్తు పట్టారా?

  • Published Jul 02, 2024 | 8:41 PM Updated Updated Jul 02, 2024 | 8:41 PM

Photo Feature: సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ రేంజ్ మెయింటేన్ చేసిన వారు ఇప్పుడు చిన్న చాన్సుల కోసం ఎదురు చూస్తున్న సమయం. కాలం కలిసి రాకపోతే వచ్చిన ఛాన్సులతో సర్ధుకుపోతున్నారు.

Photo Feature: సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ రేంజ్ మెయింటేన్ చేసిన వారు ఇప్పుడు చిన్న చాన్సుల కోసం ఎదురు చూస్తున్న సమయం. కాలం కలిసి రాకపోతే వచ్చిన ఛాన్సులతో సర్ధుకుపోతున్నారు.

  • Published Jul 02, 2024 | 8:41 PMUpdated Jul 02, 2024 | 8:41 PM
ఈ ఫోటోలో ఉన్న మల్టీ టాలెండెట్ నటుడు ఎవరో గుర్తు పట్టారా?

సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం అంటే టాలెంట్ ఉంటే మాత్రమే కాదు.. కూసింత అదృష్టం కూడా ఉండాలని అంటారు. అయితే అదృష్టం, టాలెంట్ ఉన్నప్పటికీ కొంతమందికి కాలం కలిసి రాక ఇండస్ట్రీలో రాణించలేకపోతుంటారు. ఒకప్పుడు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వాళ్లు ఛాన్సులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కొంతమంది మాత్రం తమకు దొరికిన ప్రతి ఛాన్స్‌ను అందిపుచ్చుకుంటూ మంచి పొజీషన్ లోకి వెళ్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఒకరు. ఇంతకీ ఎవరు నటుడు, దర్శకుడు? వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీలో ఇప్పుడు పరిస్థితులు ఒకప్పటిలా లేవు.. ఎన్నో హిట్ సినిమాలు తీసిన దర్శకులు నటులుగా మారుతున్నారు. హీరోలుగా నటించిన వారు విలన్లు, క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్నారు. తమకు ఇష్టమైన రంగం కానప్పటికీ కాలం కలిసిరాకపోవడంతో వచ్చిన ఛాన్సులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒకప్పడు హీరో, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకొని ఇప్పుడు విలన్ గా, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బిజీగా మారిపోయారు. ఇంతకీ ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎవరా అనుకుంటున్నారా? అయనే సముద్రఖని. అల వైకుంఠపురములో, క్రాక్, ఆర్ఆర్ఆర్, సర్కారువారి పాట, హనుమాన్ ఇలా వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో సముద్రఖని దర్శకుడిగా సత్తా చాటారు. మొదట తమిళంలో సీరియల్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి డైరెక్షన్ రంగంలో ఎదిగిపోయారు. 2001 నుంచి తమిళంలో మంచి నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది పవన్ కళ్యాన్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ‘బ్రో’ మూవీకి దర్శకత్వం వహించారు. తాజాగా సముద్రఖనికి సంబంధించిన ఓ రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో సముద్రఖని అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ఈ పాత ఫోటో వైరల్ గా మారడంతో ఆయన గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్లు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom