iDreamPost
android-app
ios-app

15 ఏళ్లకే హీరోయిన్,100కు పైగా సినిమాలు.. ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Feb 13, 2024 | 11:07 AM Updated Updated Feb 13, 2024 | 11:07 AM

ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి అప్పటిలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి అప్పటిలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Feb 13, 2024 | 11:07 AMUpdated Feb 13, 2024 | 11:07 AM
15 ఏళ్లకే హీరోయిన్,100కు పైగా సినిమాలు.. ఎవరో గుర్తుపట్టారా..?

చాలామంది సినీతారలు చిన్న వయసులోనే కథానాయికగా వెండితెర పై అడుగు పెడతారు. అలా బాల నటులుగా కొనసాగినవారు.. ఎన్నో ఆద్భుతమైన చిత్రల్లో నటించి, సినీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. ఇలా కొంతమంది సిని పరిశ్రమను ఏలుతూ.. స్టార్స్ గా ఎదిగిన వాళ్లు ఉన్నారు. మరికొందరు అయితే  స్టార్ హీరోలా సరసన, దాదాపు అన్ని భాషాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమైన వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయినా హీరోయిన్ కూడా ఆ కోవకు చెందినదే. పై ఫోటోలో కనిపిస్తున్నా ఈ అమ్మాయి అప్పటిలో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో వెలిగింది. ఈమె దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి, ఒకానొక సమయంలో టాలీవుడ్ లోకాన్నే ఓ ఊపు ఊపేసింది. ఈ క్రమంలోనే.. ఎంతోమంది అగ్రహీరోల సరసన బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నా ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫోటోలో కనిపిస్తున్నా ఈ అమ్మాయి చిన్న వయసులోనే కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడగుపెట్టింది. అలాగే తెలుగు, తమిళం, కన్నడ, మలయాలళం, హిందీ వంటి పలు భాషల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అప్పటిలో ఈమె సినిమాలకు మంచి క్రేజ్ కూడా ఉండేది. కానీ, పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆ ఫోటోలో కనిపిస్తున్నా హీరోయిన్ ఎవరంటే.. సీనియర్ నటి ‘రంభ’. ఈమె మొదటిగా.. 1992లో సీనియర్ హీరో వినీత్ సరసన ‘స్వర్గం’ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పటికి ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అలాగే అదే ఏడాది ‘సాంబకుళం దాచన్’ చిత్రంలో నటింటింది.

అలాగే 1993లో ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో టాలివుడ్ కి పరిచయమైంది రంభ. ఇక తమిళ్ లో ‘ఉఝవన్’, తెలుగులో.. ‘బావగారూ బాగున్నారా’, ‘బొంబాయి ప్రియుడు’, ‘ముద్దుల ప్రియుడు’, ‘అల్లుడా మాజాకా’, ‘అల్లరి ప్రేమికుడు’, ‘చిన్నల్లుడు’, ‘చూసొద్దాం రండి’ చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా.. ఈమె, బాలకృష్ణ, నాగర్జున, అల్లు ఆర్జున్ వంటి స్టార్ హీరోల సరసన చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అయితే, ప్రస్తుతం రంభ కెరీర్ ఆరంభంలోని ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమె చివరిసారిగా ‘పెన్ సింగం’ సినిమాలో నటించింది. ఆ తర్వాత 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ ను వివాహం చేసుకుంది. అలా పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి విదేశాల్లో స్థిరపడింది. ప్రస్తుతం రంభకి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మరి, రంభ సినీరంగ ఆరంభంలో ఉన్న ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio