iDreamPost
android-app
ios-app

బోసి నవ్వులు చిందిస్తున్న ఈ పాప.. స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా..?

తల పైకి ఎత్తి.. ఏదో చూస్తూ.. కళ్లు మూసేసి బోసినవ్వులు నవ్వుతున్న ఈ ఫోటోలోని పాప.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. గర్ల్స్ నెక్ట్ డోర్ లా మారిపోయింది. ఇంతకు ఈ బేబి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.

తల పైకి ఎత్తి.. ఏదో చూస్తూ.. కళ్లు మూసేసి బోసినవ్వులు నవ్వుతున్న ఈ ఫోటోలోని పాప.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. గర్ల్స్ నెక్ట్ డోర్ లా మారిపోయింది. ఇంతకు ఈ బేబి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.

బోసి నవ్వులు చిందిస్తున్న ఈ పాప.. స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా..?

హీరోయిన్లు ఎక్కడి నుండో పుట్టుకురారు. స్పెషల్ క్వాలిటీస్ అంటూ ఏమీ ఉండవు. మనలో నుండి ఓ అందమైన, తెలివైన, ధైర్యవంతురాలైన అమ్మాయి.. తెరపై కనిపించాలని, నటిగా రాణించాలన్న ఆశతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ జర్నీ సక్సెస్ అయితే నటిగా వెండితెరపై కనిపిస్తుంది. ఇప్పుడంటే హీరోయిన్ కనుక అందంగా కనిపించేందుకు మేకప్, కాస్మోటిక్స్, సీరమ్స్ వంటి బ్యూటీ ప్రొడక్ట్ వాడుతుంటారు. కానీ చాలా మంది హీరోయిన్లు చిన్నప్పుడు రెండు జళ్లతో లేదా చింపురు జుట్టుతో, చీముడు ముక్కు వేసుకుని, షార్ట్ అంటూ క్యూట్ గౌన్స్ వేసుకుని చాలా సాదా సీదా అమ్మాయి జీవితాన్ని గడిపినవారే. వాళ్ల డ్రాస్టిక్ ఛేంజెస్ వాళ్లే నమ్మలేనంత మారిపోతుంటారు.

కొన్ని సార్లు అటువంటి ఫన్నీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అవి ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి. ఇదిగో ఈ ఫోటోలో చిన్నారిని చూశారు కదా..దేన్నో చూసి బోసి నవ్వులు చిందిస్తూ ముచ్చట గొల్పుతున్న ఈ పాప.. ఇప్పుడో ఫేమస్ హీరోయిన్. చిన్నవయస్సులోనే కెరీర్ స్టార్ చేసి.. మాలీవుడ్ నుండి టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ అంటూ చక్కర్లు కొడుతుంది. టీటౌన్‌లో నెగిటివ్ రోల్‌తో అడుగుపెట్టిన అమ్మడు.. తన నటనతో మెస్మరైజ్ చేసింది. తన కళ్లతోనే హవభావాలు పలికే సత్తా ఉన్న నటి ఆమె. ఇక ఆమె కురులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రింగు రింగులు తిరుగుతూ.. ఆమె అందాన్ని మరింత రెట్టింపు  చేస్తాయి.

ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారు కదూ.. మన మాలీవుడ్ బ్యూటీ, నాగవల్లి అనుపమ పరమేశ్వరన్. ఆమె ఫస్ట్ సినిమానే సెన్సేషన్. అదే మలయాళ ప్రేమమ్. ఇది ఎంతటి హిట్ కొట్టిందంటే.. ఇప్పటి మూడు సార్లు రీ రిలీజ్ చేస్తే.. వాచ్ చేసే వారి సంఖ్య పెరుగుతుందట. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్-నితిన్ కాంబోలో వచ్చిన అ, ఆ మూవీలో నాగవల్లి క్యారెక్టర్‌తో చంపేసిందంతే. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది. అయితే తెలుగులో కూడా ప్రేమమ్ అదే రోల్‌లో మెప్పించింది ఈ భామ.శతమానం భవతి ఆమె కెరీర్‌కు ప్లస్ అయ్యింది.ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్దం, తేజ్ ఐ లవ్యూ, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లో అలరించింది.

రాక్షసుడు, రౌడీ బాయ్స్ తర్వాత ఆమె పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చిన మూవీ కార్తీకేయ 2. ఆ తర్వాత రిలీజ్ అయిన 18 పేజెస్ ఓకే అనిపించినా.. బటర్ ఫ్లై అనే ఓటీటీ మూవీ బోల్తా కొట్టింది. అయితే ఇప్పటి వరకు డ్రెస్సింగ్‌లో ఎక్కడా లిమిట్స్ క్రాస్ చేయని ఈ కేరళ కుట్టి.. టిల్లు స్క్వేర్‌లో మాత్రం మామూలు రచ్చ చేయడం లేదు. బోల్డ్ అండ్ హాట్ లుక్స్‌లో మన అనుపమాయేనా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు వరుసగా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈగల్ మూవీ ఈ నెల 9న థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. మరో మూవీ టిల్లు స్క్వేర్ వచ్చే 29న విడుదల కానుంది. మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. అనుపమ నటించిన చిత్రాల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap