iDreamPost
android-app
ios-app

వామ్మో ఈ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..? అస్సలు గుర్తుపట్టలేరు..

  • Published May 10, 2024 | 9:43 PM Updated Updated May 10, 2024 | 9:43 PM

స్టార్ హీరో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోల సరసన చేసింది. కట్ చేస్తే అంతే వేగంగా ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు తెరపైకి వచ్చింది. గుర్తుపట్టని విధంగా మారిపోయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

స్టార్ హీరో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోల సరసన చేసింది. కట్ చేస్తే అంతే వేగంగా ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు తెరపైకి వచ్చింది. గుర్తుపట్టని విధంగా మారిపోయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

  • Published May 10, 2024 | 9:43 PMUpdated May 10, 2024 | 9:43 PM
వామ్మో ఈ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..? అస్సలు గుర్తుపట్టలేరు..

కొంతమంది హీరోయిన్స్ సీజన్ లాంటోళ్ళు. ఇలా వచ్చి అలా మాయమైపోతారు. కొంతమంది హీరోయిన్స్ మాత్రం చెట్టులా ఇండస్ట్రీలో పాతుకుపోతారు. అనుష్క, కాజల్, తమన్నా వంటి వాళ్ళే దీనికి ఉదాహరణ. వీళ్ళు వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం అవకాశాలు లేక కొన్ని సినిమాలకే కనుమరుగైపోతున్నారు. అవకాశాలు లేకపోవడంతో ఫిట్ నెస్, గ్లామర్ వంటి వాటిపై పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఈ కారణంగా వాళ్ళని ప్రస్తుతం ఎలా ఉన్నారో చూస్తే గుర్తుపట్టడం కష్టమే అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఇదే కేటగిరీ. ఈమె మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. సంతోషం బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు కూడా గెలుచుకుంది. కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరలేకపోయింది. బాలకృష్ణ, నాని, అల్లు అర్జున్ సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా చెప్పుకోతగ్గ అవకాశాలు అయితే రాలేదు. 

ఈమె మస్కట్ లో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి మంగళూరు వాసి, తల్లి సింధి వాసి. భారతీయ మూలాలు ఉండడంతో ఈమె ఒమన్ లో ఇండియన్ స్కూల్స్ లోనే చదువుకుంది. ఆ తర్వాత చదువు కోసం తల్లితో కలిసి ముంబై వచ్చేసింది. 2005లో లక్కీ: నో టైం ఫర్ లవ్ అనే మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ధనలక్ష్మి పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత నేను మీకు తెలుసా?, కింగ్, కరెంట్, వరుడు, సింహ, అలా మొదలైంది, మడత కాజా, యాక్షన్ 3డీ, అంతా నీ మాయలోనే సినిమాల్లో నటించింది.

తెలుగులో 2014లో చేసింది. అంతే ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు.  చాలా గ్యాప్ తర్వాత 2020లో ఎక్స్ పైరీ డేట్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో దర్శనమిచ్చింది. అంతే మళ్ళీ గ్యాప్. మళ్ళీ ఇన్నాళ్లకు తెరపైకి వచ్చింది స్నేహా ఉల్లాల్. నటి తేజస్వి మదివాడతో కలిసి కనిపించింది. అయితే అప్పట్లో ఉన్నంత ముద్దుగా లేదు ఇప్పుడు. కాస్త బొద్దుగా మారిపోయింది. పర్టిక్యులర్ గా చూస్తే తప్ప గుర్తుపట్టని పరిస్థితి. పిల్లి కళ్ళతో మాయ చేసిన స్నేహ ఉల్లాల్ ప్రస్తుతం సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న భవనం సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఈ ఒక్క సినిమానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడైనా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş