ఈ ఫోటోలో అమ్మాయి ఎవరో తెలుసా.. పవన్ కి క్రేజీ ఫ్యాన్

పై ఫోటోలో పవన్ కల్యాణ్ పక్కన కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ఈమె పవన్ కు చాలా పెద్ద ఫ్యాన్. ప్రస్తుతం ఈ చిన్నది పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓ సినిమాల్లో అలరించనుంది.

పై ఫోటోలో పవన్ కల్యాణ్ పక్కన కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ఈమె పవన్ కు చాలా పెద్ద ఫ్యాన్. ప్రస్తుతం ఈ చిన్నది పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓ సినిమాల్లో అలరించనుంది.

నటించలనే ఆసక్తి, టాలెంట్ ఉంటే.. ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవే ఉండదు. ముఖ్యంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అయితే కొత్త కొత్త నటీ,నటులు ఎప్పటికప్పుడు పరిచయమవుతుంటారు. అయితే మొదటలో పెద్దగా స్కోప్ లేని, కని,కనిపించని పాత్రలో అలరించే ఆర్టిస్టులు ఆ తర్వాత మాత్రం.. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకీ పై ఫోటోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..  పవన్ కలిసి దిగిన ఈ ఫోటో ఓ సినిమాలోని పాట సన్నివేశంలోనిది.

మరీ, ఆ సినిమా ఏదో కాదు.. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది లోనిది. ఈ మూవీ 2013లో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ బాబాజీ గెటప్ లో పేరడీ సాంగ్ ను చేసి  ప్రేక్షకులను బాగా నవ్వించారు. ఇక ఆ పాటలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ అమ్మాయి కూడా  ఓ సన్నివేశంలో కనిపిస్తుంది. అయితే ఈ చిన్నదాని పేరు కళ్యాణి. నిజానికి ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఆర్టిస్ట్. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. అలాగే మరి కొన్ని సినిమాల్లో సైడ్ డ్యాన్సర్ గా కూడా కనిపించింది. కానీ, ఇప్పటి వరకు ఈమె నటించిన ఏ సినిమాలో కూడా ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు  తెచ్చిపెట్టకపోవడంతో.. ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియదు.

ఇదిలా ఉంటే.. కళ్యాణికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమట.  పైగా ఆయనతో కలిసి రెండొవసారి నటించే  గోల్డెన్ ఛాన్స్ కూడా ఈ అమ్మడు దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. ఈ బ్యూటీ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తుంది. అయితే ఇటీవలే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో కలిసి తీసుకున్న ఫోటో ఆనందంతో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ అమ్మాయి ఎవరా అని నెట్టింట అందరూ తెగ  సెర్చింగ్ చేస్తున్నారు. దీంతో తీగ లాగితో డొంక కదిలినట్టు ఈ అమ్మాయి ఇంతకు ముందు పవన్ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించే ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరీ, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ చిన్నది ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments