P Venkatesh
బాలీవుడ్ స్టార్ల పిల్లలు చదివే స్కూల్లో టీచర్ల జీతాలు తెలిస్తే మీరు షాకవుతారు. ఆ స్కూల్లో ఫీజులే కాదు టీచర్ల జీతాలు కూడా ఎక్కువే. ఇంతకీ ఎంత జీతం ఇస్తారో తెలుసా?
బాలీవుడ్ స్టార్ల పిల్లలు చదివే స్కూల్లో టీచర్ల జీతాలు తెలిస్తే మీరు షాకవుతారు. ఆ స్కూల్లో ఫీజులే కాదు టీచర్ల జీతాలు కూడా ఎక్కువే. ఇంతకీ ఎంత జీతం ఇస్తారో తెలుసా?
P Venkatesh
సాధారణంగా ప్రతిఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ఆశపడతారు. వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే తమ స్తోమతకు తగ్గటు పిల్లలను స్కూల్ లో చేర్పించడానికి, పదుల సంఖ్యలో స్కూల్స్ గురించి ఆరా తీస్తారు. వాటిలో ఏ స్కూల్ అయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుందో గమనించి అందులో చేర్పిస్తారు. కాగా, ఒక సామాన్య ప్రజలే తమ పిల్లల చదువు కోసం ఇంతలా ఆరాటపడుతుంటే.. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే వాళ్లు తమ పిల్లల కెరీర్ కోసం ఎంతలా కృషి చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీస్ తమ పిల్లలకు ఆస్తితో పాటు మంచి విద్యను అందించాలని లక్షలు పెట్టి మరీ ప్రతిష్టాత్మకమైన ఇంటర్ నేషనల్ స్కూల్స్ లో చదివిస్తుంటారు. మరి, మన దేశంలోని అత్యంత ప్రసిద్ధ పాఠశాలల్లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి. అక్కడే చాలమంది ధనవంతులు, సెలబ్రిటీస్ పిల్లలు చదువుతుంటారు. అక్కడ సెలబ్రిటీస్ పిల్లలకు కట్టే స్కూల్ ఫీజులతో ఒక మిడిల్ క్లాస్ పిల్లల చదువులు పూర్తి చేయవచ్చు. ఇక అలాంటి స్కూల్ లో పిల్లలకు చదువు చెప్పే టీచర్లకు ఇచ్చే జీతం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక ప్రైవేట్ కో-ఎడ్యుకేషనల్ డే స్కూల్. ఇది మన దేశంలో అత్యంత ప్రసిద్ధి గల పాఠశాలల్లో ఒకటి. దీని వ్యవస్థాపకురాలు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ. అయితే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే బాలీవుడ్ తారలకు ఇష్టమైన స్కూల్. చాలమంది బాలీవుడ్ తారల పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. ఇప్పుడు మన బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కుమారుడు నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కుమార్తె వరకు అందరూ ఈ స్కూల్‌లోనే చదువుతున్నారు.
ఇక కరణ్ జోహార్ కుమారుడు, కుమార్తె, షాహిద్ కపూర్ కుమారుడు, కరీనా కపూర్ ఇద్దరు కుమారులు ఇలా మన స్టార్ కిడ్స్ అంతా ఈ పాఠశాల విద్యార్థులే. అయితే ఈ స్కూల్‌లో పిల్లలు చదవాలంటే చాలా లక్షల డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పిల్లలకు నెలకు ఫీజు దాదాపు లక్షన్నర రూపాయలు వరకు ఉంటుంది. ఇక, వాళ్లకి చదువు చెప్పే టీచర్లకు నెల జీతం ఎంత ఉంటుందో? ఇక్కడ టీచర్ వృత్తి చేపట్టాలంటే ఏ అర్హతలుండాలి? అనే సందేహం చాలా మందికి ఉన్నాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..
సహజంగా ఏ స్కూల్లో అయినా టీచర్‌గా పనిచేయాలంటే బీ-ఎడ్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలని తెలిసిందే. కానీ, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మాత్రం టీచర్‌గా చేరాలంటే ‘ఫ్రెషర్’కి అవకాశం ఉండదు. కనీసం ఐదేళ్ల టీచింగ్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇక జీతం విషయానికొస్తే ఇక్కడ పాఠాలు చెప్పే టీచర్లకు నెలకు 2 లక్షల నుంచి 7 లక్షల వరకు జీతం ఉంటుంది. ఇక్కడ టీచింగ్ అనుభవం బట్టి జీతం ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ స్కూల్లో విద్యార్ధులకు కేవలం విద్య మాత్రమే సరిపోదు, దానితో పాటు స్పెషల్ యాక్టివిటీ క్లాసులు కూడా తీసుకుంటారు. మరీ, ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో టీచర్ల జీతం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.