iDreamPost

ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? గుర్తుపట్టలేరు!

ప్రేమిస్తే మూవీ ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో.. పాటలు కూడా అంతే కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఇక ఈ సినిమాలో నటీనటులకు మంచి మార్కులే పడ్డాయి. భరత్, సంధ్యలే కాదూ.. హీరోయిన్ తండ్రి, ఆమె స్నేహితురాలిగా చేసిన నటిికి కూడా.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే..?

ప్రేమిస్తే మూవీ ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో.. పాటలు కూడా అంతే కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఇక ఈ సినిమాలో నటీనటులకు మంచి మార్కులే పడ్డాయి. భరత్, సంధ్యలే కాదూ.. హీరోయిన్ తండ్రి, ఆమె స్నేహితురాలిగా చేసిన నటిికి కూడా.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే..?

ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? గుర్తుపట్టలేరు!

ప్రతి లవ్ స్టోరీ మూవీ ఎండింగ్ పెళ్లై. హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటేనే తెలుగు ఆడియన్స్ చూస్తారు. లేదంటే.. ఆ మూవీని ప్లాప్ చేసేవారు ఒకప్పుడు. కానీ తమిళ ఇండస్ట్రీ అలా కాదు.. విరహా ప్రేమ కథలు, విషాద ప్రేమ కథలు తీయడంలో దిట్ట. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే టాలీవుడ్ ప్రేక్షకులకు ఇప్పటికీ, బహుశా ఎప్పటికీ కూడా ట్రాజడీ లవ్ స్టోరీని ఇష్టపడేలా చేసిన మూవీ ప్రేమిస్తే. రియల్ స్టోరీ ఆధారంగా 2004లో తమిళంలో విడుదలై.. మంచి టాక్ తెచ్చుకున్న కాదల్ అనే పిక్చర్‌ను ప్రేమిస్తే పేరుతో తెలుగులో డబ్ చేయగా.. బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఈ సినిమా ఇంపాక్ట్ ఇప్పటికీ ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడు కట్టుకుని ఉంది.

ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి, ఓ సాధారణ యువకుడు ప్రేమించుకుని.. పెద్దల్ని ఎదిరించి, పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అమ్మాయి తండ్రి, ఇతర బంధువులు వాళ్లక్కడ ఉన్నారో వెతికి పట్టుకుని.. ఆ అబ్బాయిని చితక బాదాతారు. కూతురికి మరో పెళ్లి చేస్తాడు తండ్రి. కానీ చివరకు తన ప్రియుడ్ని రోడ్డుపై పిచ్చోడిలా చూసిన ప్రియురాలు.. బిగ్గరగా ఏడుస్తూ.. భర్తకు మొత్తం విషయం చెబుతుంది. దీంతో అతడ్ని మంచి మనిషిలా చేసే బాధ్యతను తీసుకుంటాడు భర్త. ఈ మూవీలో ప్రియుడిగా భరత్, ప్రియురాలిగా సంధ్య నటన సూపర్బ్. ఈ చిత్రం ఎప్పుడు చూసినా.. ఎండింగ్ కన్నీళ్లు తెప్పిస్తుంది. ప్రతి లవ్వర్ కు ఈ సినిమా ఓ మేలుకొలుపులా మారింది. ప్రతి ప్రేమికులకు సాయం చేసేందుకు స్నేహితులు ఉన్నట్లే.. ఈ మూవీలో కూడా ఈ లవర్స్ కు హెల్ప్ చేస్తుంది ఓ అమ్మాయి.

సంధ్య ఫ్రెండ్ పాత్రలో నటించిన మరో నటి శరణ్య నాగ్. సత్య అనే క్యారెక్టర్‌లో నటించింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు కూడా హీరోయిన్‌గా మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో టెన్త్ క్లాస్, ప్రేమ ఒక మైకం అనే సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. తమిళంలో 2015 తర్వాత కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. సినిమాల నుండి దూరం కావడానికి కారణాలు చెప్పింది. హార్మోన్ ఇన్ బ్యాలెన్స్, థైరాయిడ్ వెరసి వెయిట్ బాగా పెరిగిపోయానని, తన లావు గురించి పలువురు మాట్లాడేసరికి డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. తనకు ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని, మూవీస్‌కు గ్యాప్ కారణం ఇదేనని తెలిపింది. తనకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని, అయితే ఇప్పుడు అంత ప్రతికూలత లేదని, ఏం చేస్తున్నావని అడుగుతున్నావని పేర్కొంది. ఇటీవల మూవీ రీ యూనియన్ జరిగితే.. నటీనటులంతా సందడి చేశారు. ఏదీ ఏమైనప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్ మంచి యాక్ట్రస్ ను దూరం చేసింది.  మరీ మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sharanya Nagh (@sharanya_nagh)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి