iDreamPost
android-app
ios-app

ఆ సినిమా రిజల్ట్ తో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా! స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..

  • Author Soma Sekhar Published - 05:00 PM, Sat - 17 June 23
  • Author Soma Sekhar Published - 05:00 PM, Sat - 17 June 23
ఆ సినిమా రిజల్ట్ తో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా! స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..

సినిమా అనే రంగుల ప్రపంచంలోకి తమ టాలెంట్ ను చూపించుకోవాలని చాలా మంది వస్తుంటారు. అయితే అందులో కొంతమంది సూపర్ స్టార్ గా ఎదిగితే.. మరికొంత మంది మాత్రం ఫెయిల్యూర్ పర్సన్స్ గా మిగిలిపోతుంటారు. ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ పరిస్థితి హిట్, ప్లాఫ్ లను బట్టి మారుతుంటుంది. కానీ పరిశ్రమలో డైరెక్టర్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఓ సినిమా పోయింది అంటే ప్రొడ్యూసర్స్ వారివైపు కన్నెత్తికూడా చూడరు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఓ సినిమా వచ్చి సంవత్సరం అవుతున్న సందర్బంగా.. ఆ మూవీ డైరెక్టర్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.

వేణు ఉడుగుల.. ‘నీది నాదీ ఒకటే కథ’ లాంటి అద్భతమైన సినిమాని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. ఆ తర్వాత దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా విరాట పర్వం అనే మూవీని తెరకెక్కించారు వేణు ఉడుగుల. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన విరాట పర్వం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా కేవలం కథను మాత్రమే నమ్ముకుని డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల అయ్యి తాజాగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సంద్భంగా డైరెక్టర్ వేణు ఉడుగుల ఓ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు. డైరెక్టర్ వేణు ఉడుగుల ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.

“విరాట పర్వం సినిమా నాలో ఎంతో పరివర్తన తీసుకొచ్చింది. ఆ సినిమాకు ముందు ‘నేను’ ఆ సినిమా తర్వాత ‘నేను’ కచ్చితంగా ఒకటి కాదు. ఇక విరాట పర్వం నాకు ఎన్నో అద్భుతమైన అనుభూతులను ఇచ్చింది. వాటితోపాటుగా చాలా మంది బుద్ది జీవుల ప్రగతిశీల ప్రేక్షకులు అభిమానాన్ని, ప్రేమను పంచింది. ఇదే టైమ్ లో ఇండస్ట్రీ మార్కెట్ లో కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఈ సినిమా రిజల్ట్ తో నా కాలి కింద మందుపాతర పేలినట్లు అయ్యింది. దాంతో నేను కొన్ని నెలల పాటు నిద్రలేని రాత్రులు గడిపానని” ఎమోషనల్ అయ్యారు డైరెక్టర్ వేణు ఉడుగుల. నా ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి విరాట పర్వం సినిమా నాకు స్పూర్తినిచ్చిందని ఆయన తెలిపారు. ఇక ఈ సినిమాకు పని చేసిన సభ్యులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు డైరెక్టర్ వేణు ఉడుగుల.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss