iDreamPost
android-app
ios-app

జయం మూవీలో గోపీచంద్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడెలా ఉన్నాడంటే..?

నితిన్-సదా హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ జయం. సినిమాతో పాటు పాటలు కూడా ఓ ఊపు ఊపేశాయి. ఇందులో హీరో గోపీచంద్.. విలన్ పాత్రలో మెప్పించాడు. అతడి చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన కుర్రాడు... ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

నితిన్-సదా హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ జయం. సినిమాతో పాటు పాటలు కూడా ఓ ఊపు ఊపేశాయి. ఇందులో హీరో గోపీచంద్.. విలన్ పాత్రలో మెప్పించాడు. అతడి చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన కుర్రాడు... ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

జయం మూవీలో గోపీచంద్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడెలా ఉన్నాడంటే..?

‘వీరి వీరి గుమ్మడి పండు.. వీరి పేరేమీ.. దాగుడు మూతల దండా కోరు వీరి పేరేమీ’ ఏ సినిమాలో సాంగో చెప్పండి అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. జయం సినిమా అని ఇట్టే చెప్పేయరూ. ఆ పాటల ఇంపాక్ట్ అలాంటిది. టాలెంట్ డైరెక్టర్ తేజ నుండి వచ్చిన యంగ్ లవ్ స్టోరీ. 2022లో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నితిన్, సదా హీరో హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇదే మూవీని తమిళంలో తెరకెక్కించగా.. ఎడిటర్ మోహన్ అబ్బాయి రవి హీరోగా పరిచమయ్యాడు. ఈ చిత్రంతో రవి కాస్త జయం రవిగా కొనసాగుతున్నాడు. ఇందులో పాటలు ఇప్పటికి చార్ట్ బ్లాస్టర్సే. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. బండి బండి రైలు బండీ, ప్రియతమా, ఎవరు ఏమన్నా, రాను రాను నేను రాను కుదరయ్యో పాటలు సినిమా సక్సెస్‌కు దోహదపడ్డాయి.

ఇక ఇందులో సదా ఫేమస్ డైలాగ్ కూడా పాపులర్ అయ్యింది. ‘వెళ్లవయ్యా వెళ్లు, వెళ్లు’ అంటూ పలికే సంభాషణను చాలా మంది అమ్మాయిలు అనుకరించిన వాళ్లే. సుమన్ శెట్టి, షకీల ట్రాక్ నవ్వు తెప్పిస్తుంది. ఇందులో చెప్పుకోవాల్సిన మోస్ట్ సూపర్ పర్సనాలిటీ గోపీచంద్. టాలీవుడ్ స్టార్ హీరో గోపీ చంద్ విలన్ పాత్రలో మెప్పించాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చైల్డ్ ట్రాక్ కూడా ఉంటుంది. చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతుంటారు రఘు, సుజాతలు. వీరికి పెళ్లి చేయాలనుకుంటారు పెద్దలు. కానీ ఇద్దరికీ పడదు. యంగ్ రఘు పాత్రలో మెప్పించిన పిల్లోడు గుర్తున్నాడా..? చెడు అలవాట్లకు లోనై.. చిన్న వయస్సులో స్కూల్స్ ఎగ్గొట్టి, పెద్ద వాళ్లతో కలిసి సిగరెట్, పేకాట ఆడుతుంటాడు.

సుజాతతో మాట్లాడంటూ ఓ అబ్బాయిని చెడా మెడా కొడతాడు. చూసేందుకు అచ్చు నిఖిల్ పోలికలతో కనిపిస్తాడు. ఇంతకు ఆ చైల్ట్ ఆర్టిస్ట్ ఎవరంటే.. దిలీప్ కుమార్ సాల్వాది. 1990లో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేశాడు దిలీప్. కృష్ణ నంబర్ 1 చిత్రంలో కెరీర్ స్టార్ట్ చేసిన అతడు.. 20 సినిమాలకు పైగా బాల నటుడిగా అలరించాడు. పుణ్యభూమి నాదేశం, మౌనం, ధర్మచక్రం, స్నేహం కోసం, అనగనగా ఓ అమ్మాయి, అన్నయ్య, మా అన్నయ్య, డాడి, జయం, భాగ్మతి వంటి చిత్రాల్లో నటించాడు. 2005 తర్వాత  కొన్ని రోల్స్ చేశాడు. 2019లో వచ్చిన దిక్సూచీ మూవీతో హీరోగా మారాడు. దొంగల బండి, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో ఓ పాత్రలో మెరిశాడు. ప్రస్తుతం డిఫరెంట్ లుక్స్‌లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం శ్రీలంక టూర్‌లో చిల్ అవుతున్నాడు గురుడు.