iDreamPost
android-app
ios-app

Sukumar: పుష్ప 2.. సుకుమార్ ఊహించని నిర్ణయం! ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్..

  • Published Aug 07, 2024 | 11:58 AM Updated Updated Aug 07, 2024 | 11:58 AM

డిసెంబర్ 6న పుష్ప 2 వస్తుందా? అన్న పెద్ద సందేహం ఫ్యాన్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో సుకుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని, దాంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ 6న పుష్ప 2 వస్తుందా? అన్న పెద్ద సందేహం ఫ్యాన్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో సుకుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని, దాంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 07, 2024 | 11:58 AMUpdated Aug 07, 2024 | 11:58 AM
Sukumar: పుష్ప 2.. సుకుమార్ ఊహించని నిర్ణయం! ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్..

పుష్ప 2.. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సినిమా. దానికి కారణం? అనుకున్న టైమ్ కి థియేటర్లలోకి వస్తుందా? రాదా?. ఇప్పటికే ఆగస్ట్ 15న రావాల్సింది, డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా పుష్ప 2 మరోసారి వాయిదా పడనుందని, ఈసారి ఏకంగా 2025 ఏప్రిల్ కు సినిమా వెళ్లిపోయిందన్న వార్తలు వైరల్ గా మారాయి. ఇది చాలదు అన్నట్లుగా సుకుమార్ కు బన్నీకి మధ్య గ్యాప్ వచ్చిందన్నది ఇంకో వార్త. ఇన్ని సమస్యల మధ్యలో డిసెంబర్ 6న పుష్ప 2 వస్తుందా? అన్న పెద్ద సందేహం ఫ్యాన్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో సుకుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని, దాంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఇంతకీ సుక్కు తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

పుష్ప 2.. ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6కు వాయిదా పడటంతో నిర్మాతలపై ఆర్థిక భారం పడింది, ఇక ఈ డేట్ అస్సలు మిస్ కావొద్దు అంటున్నాడు బన్నీ. ఈ డేట్ కు రాకపోతే.. ప్రొడ్యూసర్స్ పై ఇంకాస్త ఆర్థిక భారం పడుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న సుకుమార్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కంటిన్యూస్ గా ఇలాగే షూట్ జరిగితే.. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి అవుతుంది. దాంతో నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చు.

Sukku

అయితే సుకుమార్ మాత్రం సెప్టెంబర్ నాటికే షూట్ ను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట. అందుకోసం స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు ఎపిసోడ్స్ ను పూర్తిగా తొలగించాడని, మరికొన్ని సన్నివేశాలను పేపర్ పైనే ట్రిమ్ చేశాడని టాక్. అందువల్ల అనవసరంగా షూటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దాంతో కొన్ని రోజులు అదనంగా కలిసి వస్తాయి. ఇప్పుడు ఇది పుష్ప 2కు చాలా అవసరం. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటం, షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతోనే సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సుక్కును దగ్గరి నుంచి చూసిన వారు మాత్రం ఇది నిజం కాదు అని చెబుతున్నారు. ఎందుకంటే?

క్వాలిటి విషయంలో సుకుమార్ ఎక్కడా తగ్గడు అన్నది మనందరికి తెలిసిన విషయమే. తనకు కావాల్సిన షాట్ వచ్చే వరకు షూటింగ్ చేస్తూనే ఉంటడు సుకుమార్. ప్రేక్షకులకు తన మైండ్ లో ఉన్నది చూపించాలన్నది ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఆలోచన. మరి అలాంటి సుకుమార్ స్క్రిప్ట్ ను ట్రిమ్ చేశాడని వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే సుక్కు ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. హమ్మయ్య అనుకున్న టైమ్ కు పుష్ప రాజ్ థియేటర్లలోకి వస్తాడని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ నిజంగానే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకుంటే? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet