iDreamPost
android-app
ios-app

Hero: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సుజీత్ గిఫ్ట్

  • Published Feb 16, 2024 | 11:26 AM Updated Updated Feb 16, 2024 | 12:46 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో ఓజీ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వేళ దర్శకుడు సుజీత్ అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ అందించారు. అదేమిటంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో ఓజీ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వేళ దర్శకుడు సుజీత్ అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ అందించారు. అదేమిటంటే..

  • Published Feb 16, 2024 | 11:26 AMUpdated Feb 16, 2024 | 12:46 PM
Hero: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సుజీత్ గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ ఓజీ అనే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో, అభిమానులు తమ అభిమాన సెలబ్రిటీల నుండి అప్ డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు తమ అభిమాన హీరోల తాజా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల కోసం ఎక్కువగా ఆరా తీస్తుంటారు. అలా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు సుజీత్ ఒక స్పెషల్ గిఫ్ట్ అందించారు.

ఇటీవలే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ ‘దే కాల్ హిమ్ ఓజీ’ సినిమా పై అందరి దృష్టి సుజీత్ పై పడింది. ఇక దర్శకుడు సుజీత్ లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ అప్ డేట్ లో తను, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేయగా ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో ఓజీ సెట్స్ నుంచే అని తెలిసిన అభిమానులు క్షణాల్లో వైరల్ చేసేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్, సుజీత్ ముఖం కనిపించనప్పటికీ పవన్ అభిమానులు మాత్రం ఆ ఫోటోకు ఫిదా అయిపోయారు.

స్టార్ హీరోగానే కాకుండా జనసేన పార్టీ అధినేతగా కూడా ప్రజలకు సేవ చేయాలని తపిస్తున్న పవన్ కళ్యాణ్… త్వరలో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత ఆయన తిరిగి సినిమా షూటింగుల్లో పాల్గొంటారు. ఓజీ రాక కోసం చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవలే ఓజీ సినిమాని 2024 సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. ఎందుకంటే 2013లో అత్తారింటికి దారేది సినిమా కూడా అదే రోజున విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడే అదే రోజు ఓజీ కూడా విడుదల అవుతుండటంతో పవర్ స్టార్ కు మరో భారీ హిట్ ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet