iDreamPost
android-app
ios-app

Kollywood: ఘనంగా జరిగిన డైరెక్టర్ శంకర్ కూతురి నిశ్చితార్థం

  • Published Feb 19, 2024 | 11:06 AM Updated Updated Feb 19, 2024 | 1:03 PM

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ఇంట పండగ వాతవరణం నెలకొంది. తాజాగా ఆయన ఇంట్లో ఓ మంచి శుభకార్యం జరిగింది. అదేమిటంటే..

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ఇంట పండగ వాతవరణం నెలకొంది. తాజాగా ఆయన ఇంట్లో ఓ మంచి శుభకార్యం జరిగింది. అదేమిటంటే..

  • Published Feb 19, 2024 | 11:06 AMUpdated Feb 19, 2024 | 1:03 PM
Kollywood: ఘనంగా జరిగిన డైరెక్టర్ శంకర్ కూతురి నిశ్చితార్థం

ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఇంట్లో ఒక శుభవార్త వినిపిస్తుంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్యర్య రెండో పెళ్లి చేసుకోనుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయాన్ని తన సోదరి హీరోయిన్‌ అదితి శంకర్‌ సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. మొదట 2021లో క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌ను ఐశ్యర్య వివాహం చేసుకున్నారు. మహాబలిపురంలో ఎంతో ఘనంగా వీరిద్దరి వివాహం జరిగింది. కానీ వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాది క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఐశ్వర్య శంకర్ డాక్టర్‌గా కొనసాగుతుండగా… అదితి శంకర్ హీరోయిన్ గా, సింగర్ గా సినీ ఇండస్ట్రలో పని చేస్తున్నారు. తాజాగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న తరుణ్ కార్తికేయన్‌తో ఐశర్య నిశ్చితార్థం జరిగింది. ఇదే విషయాన్ని అదితి శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో వారిద్దరి ఫోటోలు షేర్‌ చేశారు. పైన చెప్పుకున్న విధంగా క్రికెటర్‌ రోహిత్ దామోదరన్‌ను 2021లో డాక్టర్ ఐశ్వర్య శంకర్‌ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల్లోనే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పట్లో రోహిత్ దామోదరన్ కు పోక్సో కేసులో ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రోహిత్ నిర్వహిస్తున్న క్రికెట్ కోచింగ్ సెంటర్‌లో మహిళా ఆటగాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారని చాలా ఫిర్యాదులు రావడంతో ఆయన పై కేసు నమోదైంది. దీంతో ఐశ్వర్య శంకర్ అతని నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఐశ్వర్య తన తండ్రి శంకర్‌తోనే కలిసి ఉంటున్నారు. ఇక త్వరలోనే ఐశ్వర్య – తరుణ్ ల పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనే వివరాలను వెల్లడిస్తారు.

Director Shankar's daughter's engagement was grand

శంకర్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌, ఇండియన్‌ 2, ఇండియన్‌ 3 చిత్రాలను రూపొందిస్తున్నారు. `గేమ్‌ ఛేంజర్‌`లో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో గేమ్ ఛేంజర్‌ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.మరో వైపు కమల్‌ హాసన్‌తో `ఇండియన్‌ 2, 3`లను కూడా శంకర్ తెరకెక్కిస్తున్నారు. రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతాయని అంటున్నారు.