iDreamPost
android-app
ios-app

భారతీయుడు 2 న్యూ లిరికల్ సాంగ్.. ఈసారి శంకర్ మాస్ టచ్ తో..!

Bharateeyudu 2 Movie Calendar Lyrical Song: డైరెక్టర్ శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 సినిమా నుంచి ఒక క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. క్యాలెండర్ అంటూ ఒక లిరికల్ వీడియో వచ్చేసింది.

Bharateeyudu 2 Movie Calendar Lyrical Song: డైరెక్టర్ శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 సినిమా నుంచి ఒక క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. క్యాలెండర్ అంటూ ఒక లిరికల్ వీడియో వచ్చేసింది.

భారతీయుడు 2 న్యూ లిరికల్ సాంగ్.. ఈసారి శంకర్ మాస్ టచ్ తో..!

ప్రస్తుతం కల్కి హవా కొనసాగుతోంది. ఈ మూవీ తర్వాత పాన్ ఇండియా లెవల్లో సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా భారతీయుడు 2 అనే చెప్పాలి. అయితే శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి ఆశించినంత హైప్ అయితే లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు డైరెక్టర్ శంకర్ ఇచ్చిన ఈ అప్ డేట్ తో కచ్చితంగా అవన్నీ మాయం అయిపోతాయి. మూవీ టీమ్ ఒక కొత్త లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేసింది. ఆ సాంగ్ చూసిన తర్వాత ఇది కదా డైరెక్టర్ శంకర్ మాస్ టచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న కాస్తో కూస్తే నెగిటివ్ టాక్ కూడా ఈ సాంగ్ తో పోయినట్లు అయ్యింది.

కల్కి 2898 ఏడీ సినిమాలో కలిగా కమల్ హాసన్ పాత్ర చాలా తక్కువ ఉంది అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నిజానికి అసలు పాత్ర రెండో భాగంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు కమల్ హాసన్ జూలై 12న భారతీయుడు 2 రూపంలో వస్తున్న విషయం తెలిసిందే. భారతీయుడు 2 రిలీజ్ కి ఇంకా రెండు వారాలు కూడా లేదు. అందుకే మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సాంగ్స్ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. తాజాగా క్యాలెండర్ సాంగ్ పేరిట మరో లిరికల్ సాంగ్ ని మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఆ సాంగ్ చూసిన తర్వాత డైరెక్టర్ శంకర్ టచ్ గురించి టాక్ నడుస్తోంది.

Indian2 song

సాధారణంగా డైరెక్టర్ శంకర్ సినిమా అంటే సాంగ్స్ మీద భారీ భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ ఆ టచ్ కనపడలేదు అనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ, తాజాగా వచ్చిన సాంగ్ మాత్రం వాటిని తుడిచిపెట్టేసింది. శంకర్ సినిమా అంటే సాంగ్స్ లో కచ్చితంగా ఒరిజినల్ లొకేషన్స్ లో తీసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే ఈ సాంగ్ ని కూడా ఒక లైవ్ లొకేషన్ లోనే ప్లాన్ చేశారు. సాంగ్ మాత్రం బాగా రిచ్ గా ఉంది. అలాగే డైరెక్టర్ శంకర్ వింటేజ్ టచ్ కనిపిస్తోంది.

ఇప్పటివరకు ఏఆర్ రెహ్మాన్ లేకపోవడం కాస్త మైనస్ అనుకున్నారు. కానీ, అనిరుధ్ ఈ సాంగ్ తో ఆ కామెంట్స్ ని కూడా సైలెంట్ చేసినట్లు అయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ క్యాలెండర్ సాంగ్ ట్రెండ్ అవుతోంది. అలాగే సినిమాపై ఇప్పటివరకు ఉన్న కాస్తో కూస్తో నెగిటివిటీని తీసేసినట్లు అయ్యింది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ నుంచి చాలా మంచి మూవ్ అనే చెప్పాలి. మరి.. ఈ క్యాలెండర్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş