iDreamPost
android-app
ios-app

Om Raut: ‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత తొలి ట్వీట్ చేసిన ఓం రౌత్! ఏం చెప్పాడంటే?

  • Author Soma Sekhar Published - 05:20 PM, Sat - 17 June 23
  • Author Soma Sekhar Published - 05:20 PM, Sat - 17 June 23
Om Raut: ‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత తొలి ట్వీట్ చేసిన ఓం రౌత్! ఏం చెప్పాడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాఘురాముడిగా, కృతి సనన్ జానకీ దేవిగా కలిసి నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. అయితే నెటిజన్స్ మాత్రం డైరెక్టర్ ఓం రౌత్ ను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ పరంగా, పాత్రల పరంగా డైరెక్టర్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ తర్వాత తొలి ట్వీట్ చేశారు ఓం రౌత్. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఆదిపురుష్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. అయితే తొలి రోజే ఈ సినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్టాఫ్ ని అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ సెకండాఫ్ ను మాత్రం వదిలేశాడని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అయినప్పటికీ ఆదిపురుష్ ప్రభాస్ క్రేజ్ తో భారీ వసూళ్లను సాధించింది. తొలి రోజే రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దుమ్మురేపింది. ఇక ఆదిపురుష్ ప్రదర్శింపబడే ప్రతి థియేటర్ లో ఓ సీట్ ను హనుమంతుడి కోసం కేటాయించాలని మూవీ యూనిట్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఓ సీట్ ను హనుమాన్ ఫొటోతో ఉన్న క్లాత్ తో రిజర్వ్ చేసి ఉంచారు.

ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ తర్వాత తొలి ట్వీట్ చేశారు డైరెక్టర్ ఓం రౌత్. దాంతో ఆ ట్వీట్ లో సినిమా రిజల్ట్ గురించి ఏమైనా చెప్పాడా అని ఆసక్తిగా చూశారు. కానీ అందులో హనుమంతుడికి కేటాయించిన సీట్లన్ని ఒకచోటకు చేర్చి ట్వీటర్ లో జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చారు. దేశంలో అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయి అని తెలిపారు ఓం రౌత్. ఆదిపురుష్ కథపై వస్తున్న విమర్శలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఈ డైరెక్టర్ సాబ్.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet