iDreamPost
android-app
ios-app

జైలర్ పార్ట్- 2 ఉంటుందన్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్!

  • Published Aug 14, 2023 | 10:03 PM Updated Updated Aug 14, 2023 | 10:03 PM
  • Published Aug 14, 2023 | 10:03 PMUpdated Aug 14, 2023 | 10:03 PM
జైలర్ పార్ట్- 2 ఉంటుందన్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్!

ప్రస్తుతం పాన్ వరల్డ్ లెవల్లో రజినీకాంత్– నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ సినిమా బాక్సీఫీస్ వద్ద దూసుకుపోతోంది. కలెక్షన్స్ లో రోజుకు ఒక రికార్డు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఉన్న పలు బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులను తుడిచిపెట్టేస్తోంది. కేవలం నాలుగే నాలుగు రోజుల్లో జైలర్ సినిమా రూ.300 కోట్ల క్లబ్ లో చేరి అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఒక్క సౌత్ లోనే కాకుండా.. నార్త్ లో కూడా జైలర్ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే జైలర్ పార్ట్-2 గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ వార్తలపై డైరెక్టర్ నెల్సన్ క్లారిటీ ఇచ్చారు.

ఇటీవలి కాలంలో రజినీకాంత్ నుంచి వచ్చిన చాలా సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాలను అందుకోలేదు. కానీ, నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ సినిమాతో రజినీకాంత్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి తెలియజేసినట్లు అయింది. జైలర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ అంతకు మించి భారీ విజయాన్ని నమోదు చేసింది. కేవలం నాగులు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్ లో ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది అని. అందుకే జైలర్ పార్ట్-2 కోసం ప్రేక్షకులు ఇప్పుడే ఊహాగానాలు ప్రారంభించేశారు.

ఈ నేపథ్యంలోనే నెల్సన్ దిలీప్ కుమార్ కూడా జైలర్ సినిమాకి పార్ట్- 2 ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమాకి సీక్వెల్ తీస్తానంటూ నెల్సన్ చెబుతున్నాడు. అయితే నెల్సన్ ఈ ఒక్క సినిమాకే కాదండోయ్.. తాను నయనతారతో తీసిన కోలమావు కోకిల, శివ కార్తికేయన్ తో తెరకెక్కించిన డాక్టర్, దళపతి విజయ్ తో తీసిన బీస్ట్ సినిమాలకు కూడా సీక్వెల్ తీస్తానంటూ చెప్పడం ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తోంది. అక్కడితో ఆగకుండా నెల్సన్ తన మనసులో ఉన్న ఇంకో పెద్ద కోరికను కూడా ప్రేక్షకుల ముందు ఉంచాడు. అదేంటంటే.. రజినీకాంత్- దళపతి విజయ్ కాంబోలో ఒక సినిమా తీయాలి అనేది తన కలగా చెప్పుకొచ్చాడు. బీస్ట్ సినిమాతో విజయ్ ని, జైలర్ సినిమాతో రజినీకాంత్ ని నెల్సన్ దిలీప్ కుమార్ ఎంతగానో ఇంప్రెస్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిజంగానే నెల్సన్ మంచి కథ రెడీ చేస్తే రజినీ- విజయ్ కాంబోలో తప్పకుండా సినిమాని తెరకెక్కించవచ్చు. అందుకు ఇద్దరు స్టార్లు కచ్చితంగా ఓకే చెప్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సీక్వెల్ వార్తల కంటే కూడా అభిమానులను రజినీ- విజయ్ కాంబో వార్తలు బాగా ఎగ్జైట్ చేస్తున్నాయి. అదే నిజమయ్యి.. ఆ సినిమా రిలీజ్ అయితే వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇప్పటికే ఉన్న ఎన్నో రికార్డులను ఆ సినిమా తిరగరాస్తుదనే చెప్పాలి. మరి.. నెల్సన్ చెప్పిన ప్రకారం తన డ్రీమ్ ని ఫిల్ చేసుకుంటే సినిమా ప్రేక్షకుల పండగనే అవుతుంది. రజినీకాంత్– విజయ్ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet