iDreamPost
android-app
ios-app

Prabhas: హనురాఘవపూడి-ప్రభాస్ మూవీకి క్రేజీ టైటిల్!

  • Published Jul 13, 2024 | 1:07 PM Updated Updated Jul 13, 2024 | 1:07 PM

హనురాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి ఓ క్రేజీ టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

హనురాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి ఓ క్రేజీ టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 13, 2024 | 1:07 PMUpdated Jul 13, 2024 | 1:07 PM
Prabhas: హనురాఘవపూడి-ప్రభాస్ మూవీకి క్రేజీ టైటిల్!

‘కల్కి 2898 AD’ మూవీ సూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రూ. 1000 కోట్ల కలెక్షన్లు సాధించి.. అదే రేంజ్ లో దూసుకెళ్తోంది. పాన్ ఇండియా హీరోగా ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న డార్లింగ్.. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’తో పాటుగా డీసెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న హనురాఘవపూడి డైరెక్షన్ లో ఓ చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి ఓ క్రేజీ టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘సీతారామం’ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ హనురాఘవపూడి. ఈ సినిమా విజయంతో దేశవ్యాప్తంగా తన పేరుమారుమోగిపోయింది. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ప్రభాస్ తో చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మూవీ ప్రకటించిన దగ్గరనుంచి డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానుల్లో క్యురియాసిటి పెరిగింది. కథ ఏంటి? లవ్ స్టోరీనా? పీరియాడికల్ డ్రామానా? ఇలా రకరకాలుగా అభిమానులు ఊహించుకున్నారు.

ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. 1947 కంటే ముందు సాగే స్టోరీతో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. బ్రిటీష్ సైన్యంలో సైనికుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడని సమాచారం. యుద్ధం నేపథ్యంలో సాగే స్టోరీ అయినప్పటికీ.. హనురాఘవపూడి స్టైల్లో సాగే అందమైన ప్రేమ కథ కూడా ఇందులో ఉంటుందట. ఇక ఈ మూవీకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఫౌజీ అంటే సైనికుడు అని అర్ధం. అయితే.. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే.. షూటింగ్ పూర్తి అయ్యేలోగా.. కొత్తగా ఏదైనా టైటిల్ తడితే.. ఇది మారుతుంది.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించినప్పటికీ.. మృణాల్ ఠాకూర్ దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. ఇక ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చనున్నాడు. ఇప్పటికే కొన్ని పాటలను సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరి ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet