iDreamPost
android-app
ios-app

Anchor Rashmi: ముచ్చుమర్రి ఘటనపై యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్! నెటిజన్స్ మద్దతు!

  • Published Jul 13, 2024 | 11:56 AM Updated Updated Jul 13, 2024 | 11:56 AM

ఇటీవలే  ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దారుణం గురించి అందరికీ తెలిసిందే. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామినికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి వాసంతిని ముగ్గురు మైనర్లు హత్యాచారం చేశారు. అయితే ఈ దారుణమైన ఘటనతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. అంతేకాకుండా.. ఈ ఘటనపై పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెర యాంకర్ రష్మీ కూడా తనదైన శైలిలో ఘాటుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jul 13, 2024 | 11:56 AMUpdated Jul 13, 2024 | 11:56 AM
Anchor Rashmi: ముచ్చుమర్రి ఘటనపై  యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్! నెటిజన్స్ మద్దతు!

యాంకర్ ‘రష్మీ’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా బుల్లితెర ఆడియన్స్ కు అయితే ఈ పేరు సుపరిచితమే. ఎందుకంటే.. బుల్లితెరపై సుదీర్ఘ కాలంలో యాంకర్ గా తెలుగు ఆడియాన్స్ ను మెప్పిస్తుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా.. వెండితెరపై కూడా హీరోయిన్ గా అలరించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తన అందంతో, మాటలతో అందర్నీ ఆకట్టుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇకపోతే యాంకర్, హీరోయిన్ గా కాకుండా.. రష్మీ సమాజంలో జరిగే అన్యాయాలపై కూడా ఈమె తనదైన స్టైల్ లో స్పందిస్తుంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా .. మూగ జీవులకు ఏదైనా ఇబ్బంది కలిగినా, హాని జరిగినా.. అలాగే సమాజంలో అమ్మాయిలపై జరిగే దాడులు, అఘాయిత్యలపై కూడా స్పందిస్తూ ఫైర్ అవుతుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఇటీవలే ఓ మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంపై ఏకంగా సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు.

ఇటీవలే  ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దారుణం గురించి అందరికీ తెలిసిందే. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామినికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి వాసంతిని, 15 ఏళ్ల ముగ్గురు మైనర్ బాలులు హత్యచారం చేశారు. అనంతరం శవం కూడా దొరకకుండా ఎత్తి పోతల కాలువలో పడేశారు.  ఇక ఈ దారుణమైన ఘటన జరిగి వారం రోజులు గడిచిన ఇంత వరకు బాలిక మృతదేహం లభ్యం కాలేదు. దీంతో మృతురాలి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ఇక ఘటన ఒక్కసారిగా సంచలనం గా మారింది. అందరూ ఈ ఘటనపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ ఘటన పై బుల్లితెర యాంకర్  రష్మీ  స్పందించి సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది.

కాగా, ప్రస్తుతం ఆ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రష్మీ చేసిన పోస్టులో.. ‘వాళ్లు పెద్ద వాళ్లలా హత్యా చారం చేయగలిగితే, శిక్ష కూడా పెద్ద వాళ్ల లాగే ఉండాలి. ముఖ్యంగా వాళ్లు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు. కాబట్టి, వాళ్లు కచ్చితంగా మైనర్లు అయితే కాదు. మైనర్లు అనే నెపంతో వాళ్లు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు’ అని రష్మీ ట్వీట్ చేసింది. అలాగే ఈ పోస్టును  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎంవోకు  ట్యాగ్ చేసింది. అయితే రష్మీ చేసిన పోస్టుకు పలవురు నెటిజన్స్ కూడా రియాక్ట్ అవతూ ఆమెకు మద్ధతుగా పోస్టులు పెడుతున్నారు.   మరి, యాంకర్ రష్మీ బాలికపై జరిగిన దారుణమైన ఘటన పై స్పందించి చేసిన పోస్టు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss