Venkateswarlu
మంగళవారం సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఓ రివ్యూ రైటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడికి సెన్స్ లేదంటూ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
మంగళవారం సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఓ రివ్యూ రైటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడికి సెన్స్ లేదంటూ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
Venkateswarlu
భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ‘మంగళవారం’ సినిమా.. అంచనాలను అందుకుంది. ప్రేక్షకులనుంచే కాక, విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా సినిమా సూపర్ సక్సెస్ అయింది. మొదటి రోజు 5 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇక, ఈ సినిమాకు దాదాపు అన్ని తెలుగు మీడియా సంస్థలు మంచి రేటింగ్‌ను ఇచ్చాయి. మంగళవారం మంచి రివ్యూలు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసింది.
శనివారం మంగళవారం సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి రివ్యూలు రాసే వారిపై స్పందించారు. ట్విస్టులు రివీల్ చేయకుండా రివ్యూలు రాసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓ రివ్యూ రైటర్‌పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..
సినిమాను పెద్ద హిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. రివ్యూలు రాసిన మీడియా, యూట్యూబ్, ట్విట్టర్ వాళ్లకి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ‘నేను ఏదైతే రిక్వెస్ట్ చేశానో ట్విస్ట్‌ల గురించి..
క్యారెక్టర్స్ గురించి రివీల్ చేయొద్దని చెప్పానో.. నా మాటని గౌరవిస్తూ ఎవరూ పాత్రల్ని లీక్ చేయకుండా హైడ్ చేసి ఉంచారు. వాళ్లందరికీ థాంక్స్’ అని అన్నారు. ఓ వ్యక్తి తాను సీనియర్ అని చెప్పుకుంటూ ఉంటాడని, కనీసం సెన్స్ లేకుండా పేపర్ పట్టుకుని సినిమా కథ మొత్తం చదివి, వినిపిస్తూ ఉంటాడని అన్నారు. నచ్చడం, నచ్చకపోవటం వ్యక్తిగత అభిప్రాయమని, దాన్ని తప్పుపట్టలేమని అన్నారు. ఒకరిద్దరు తప్పితే.. మిగిలిన రివ్యూ రైటర్లందరూ సినిమా గురించి చాలా బాగా రాశారని అన్నారు.
ఇండస్ట్రీనుంచి చాలా మంది ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారని తెలిపారు. మంగళవారం సినిమాలో శైలు లాంటి పాత్ర చేయడానికి దమ్ము ఉండాలని అన్నారు. తన సినిమాలో హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఆర్‌ఎక్స్ 100 సినిమాలానే .. మంగళవారం సినిమా కూడా జనాలకు గుర్తుండిపోతుందని తెలిపారు. కాగా, మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజ్మల్ అమిర్, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇక, ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్‌డేట్ కూడా వచ్చింది. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, సినిమాకు థియేటర్లలో వచ్చే స్పందనను బట్టి రిలీజ్ డేట్ అటు, ఇటు అయ్యే అవకాశం ఉంది. మరి, అజయ్ భూపతి ఓ రివ్యూ రైటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.