Chiranjeevi: పద్మవిభూషణ్ కోసం ఇండస్ట్రీ స్పెషల్ ఈవెంట్! వాళ్లొస్తేనే కదా అందం!

చింరజీవికి పద్మ విభూషణ్‌ అవార్డు వచ్చిన సందర్భంగా ఓ ఈవెంట్‌ నిర్వహిస్తామని దిల్‌ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ వివరాలు..

చింరజీవికి పద్మ విభూషణ్‌ అవార్డు వచ్చిన సందర్భంగా ఓ ఈవెంట్‌ నిర్వహిస్తామని దిల్‌ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ వివరాలు..

మెగాస్టార్‌ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఖ్యాతి చేరింది. 40 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో ఇప్పటికే ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోగా.. తాజాగా దేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్‌ చిరంజీవిని వరించింది. అభిమానుల వల్లే తనకు ఇంతటి గౌరవం దక్కిందంటూ.. మరోసారి ఫ్యాన్స్‌పై తన ప్రేమను చాటుకున్నారు చిరంజీవి. ఇక మెగస్టార్‌కు ఈ అవార్డు రావడం పట్ల సినీ, రాజకీయ సెలబ్రిటీలు మాత్రమే కాక అభిమానులు, సామాన్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు.. చిరంజీవిని అభినందించారు.

ఇక చిరంజీవికి అవార్డు రావడం అంటే అది మొత్తం టాలీవుడ్‌కు వచ్చినట్లే. ఈ విషయాన్ని ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ అంగీకరిస్తారు. ఈ క్రమంలో చిరంజీవికి పద్మ విభూషణ్‌ అవార్డు వచ్చిన సందర్భంగా ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి.. అందరిని ఆహ్వానించి.. ఆయనకు సన్మానం చేస్తామని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. దీనిపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిని సన్మానించుకోవడం అంటే.. తెలుగు ఇండస్ట్రీని సన్మానించడమే అని కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే దిల్‌ రాజు ప్రకటన వెలువడిన తర్వాత కొందరు సరికొత్త ప్రతిపాదనను తెర మీదకు తెస్తున్నారు. టాలీవుడ్‌లో చిరంజీవి సమకాలీకులైన నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో నాగార్జున, వెంకటేష్‌, బాలకృష్ణ, సుమన్‌, రాజశేఖర్‌, మోహన్‌బాబు వంటి వారు చిరంజీవి ముందో, తర్వాతనో కెరీర్‌ స్టార్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఇప్పటికీ కూడా వారంతా ఇండస్ట్రీలోనే కొనసాగతున్నారు. మరి చిరంజీవికి పద్మవిభూషణ్‌ వచ్చిన నేపథ్యంలో నిర్వహించే వేడుకకు వీరంతా కలిసి వస్తే.. అది కన్నుల పండుగ్గా మారతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

పైగా వీరంతా ఒకే మీదకు వస్తే.. ఇండస్ట్రీలో ఓ స్నేహపూర్వక వాతావరణం నెలకొని ఉందని చూపించడమే కాక.. తామంతా ఒక్కటే అని.. అభిమానులకు  చెప్పకనే చెప్పినట్లు అవుతుంది అంటున్నారు. అందుకే ఆ నటులందరూ ఆ వేడుకకు కలిసి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్లంతా వస్తేనే ఈ వేడుకకు అందం అంటున్నారు. మరి ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇక 2006లోనే చిరంజీవికి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు గానూ పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆయనకు పద్మ విభూషణ్‌ అవార్డు ప్రకటించారు. త్వరలోనే భారతరత్న కూడా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Show comments