iDreamPost
android-app
ios-app

దిల్ రాజు ఇంట పెళ్లి వేడుకలు.. ఆ యంగ్ హీరో నిశ్చితార్థం

  • Published Dec 01, 2023 | 11:21 AM Updated Updated Dec 01, 2023 | 11:21 AM

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంట పెళ్లి వేడుకలు జరిగాయి. ఆయన సోదరుడి కుమారుడి నిశ్చితార్థం జరిగింది. ఆ వివరాలు..

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంట పెళ్లి వేడుకలు జరిగాయి. ఆయన సోదరుడి కుమారుడి నిశ్చితార్థం జరిగింది. ఆ వివరాలు..

  • Published Dec 01, 2023 | 11:21 AMUpdated Dec 01, 2023 | 11:21 AM
దిల్ రాజు ఇంట పెళ్లి వేడుకలు.. ఆ యంగ్ హీరో నిశ్చితార్థం

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. డిసెంబర్ నెలలో చాలా వివాహాలు జరుగనున్నాయి. పెళ్లి పీటలు ఎక్కే వారి జాబితాలో సామాన్యులు మాత్రమే కాక సెలబ్రిటీలు సైతం ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లీ పీటలు ఎక్కగా.. తాజాగా పూజా గాంధీ వివాహం చేసుకుంది. అలానే హీరో రణ్‌దీప్‌ హుడా, నటి మాళవికా రాజ్ సైతం ఏడుగులు వేశారు. ఇక త్వరలోనే మరికొందరు సెలబ్రిటీలు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.  ఆ వివరాలు..

దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు, రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ నిశ్చితార్థం గురవారం జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. అద్వైత రెడ్డితో ఆశిష్ ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ పెద్దగా కనిపించలేదు. దాంతో అత్యంత గోప్యంగా, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ ఎంగేజ్మెంట్ వేడుకల్ని నిర్వహించినట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఆశిష్ రెడ్డి, అద్వైత రెడ్డిల ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు ఆశిష్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరిచింది. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఈ సినిమాలో అనుపమతో లిప్ లాక్ సీన్లలో నటించి బాగానే ఫేమస్ అయ్యాడు ఆశిష్. బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికి రౌడీ బాయ్స్ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం విశాల్ కాశీ దర్శకత్వంలో రెండో సినిమా సెల్ఫిష్ అనే మూవీని ప్రకటించాడు. దీనిలో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆశిష్ వివాహం చేసుకోబోయే యువతి అద్వైత రెడ్డి విషయానికి వస్తే ఆమె ఆంధ్రాకు చెందిన బిజినెస్ మెన్ కుమార్తె అని తెలుస్తోంది. ఇక వీరిద్దరి వివాహాం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని సమాచారం. కాగా కొన్ని రోజుల క్రితం దిల్‌ రాజు, శిరీష్‌ల తండ్రి కన్ని మూశారు. విషాదం జరిగిన కుటుంబంలో ఏదైనా శుభ కార్యం జరిగితే మంచిదనే ఆలోచనతో ఆశిష్‌ రెడ్డి పెళ్లి చేయాలని దిల్‌ రాజు కుటుంబ సభ్యులు భావించారట. అందులో భాగంగానే ఇప్పుడు ఎంగజ్ మెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఆశిష్‌ పెళ్లి వేడుకకు ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం దిల్ రాజు యానిమల్ మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet