nagidream
సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోటోలు నెట్టింట చక్కెర్లు కొట్టడం మామూలే. వారి చిన్నప్పటి ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఒకప్పటి స్టార్ హీరో తమ్ముడు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ తండ్రి త్రోబ్యాక్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఎవరో గుర్తుపట్టారా?
సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోటోలు నెట్టింట చక్కెర్లు కొట్టడం మామూలే. వారి చిన్నప్పటి ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఒకప్పటి స్టార్ హీరో తమ్ముడు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ తండ్రి త్రోబ్యాక్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఎవరో గుర్తుపట్టారా?
nagidream
సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఒక సెలబ్రిటీ ఫోటో కూడా వైరల్ అవుతోంది. మరి పై ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ తండ్రి. దేశం గర్వించతగ్గ నటుడి తండ్రి ఆయన. దానంలో ఆయన కొడుకు మహారాజు. ఇండస్ట్రీలో శత్రువులు లేనటువంటి వ్యక్తి. కొడుకు హీరో అయితే ఈయన ఒక నిర్మాత. టాలీవుడ్ కి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన ఘనత ఆయనది. ఆయన నిర్మించిన సినిమాలు పదే అయినప్పటికీ అందులో దాదాపు సగానికి పైగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈయన అన్నయ్య ఒక హీరో. ఈయన చేసిన పది సినిమాల్లో తొమ్మిది సినిమాలో తన అన్నయ్యతోనే చేశారు. ఒకే ఒక్క సినిమా బాలీవుడ్ లో వేరే హీరోతో చేశారు.
విశేషం ఏంటంటే.. ఈయన చిత్ర బ్యానర్ లోనే తన కొడుకు సినిమాని నిర్మించారు. ఈయన కొడుకు పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు దేశం గర్వించతగ్గ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. ఈయన తన కెరీర్ లో బాపు, కె. రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావులతో కలిసి పని చేశారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా గానీ గొప్ప సినిమాలని అందించిన ఘనత ఆయనది. ఇప్పుడు పాన్ ఇండియాగా చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కూడా ఒకప్పుడు ఈయన చేసిన సినిమా టైటిల్ తోనే వస్తుంది. మరి ఈయనెవరో గుర్తుపట్టారా?
ఆయన మరెవరో కాదు.. దేశం గర్వించే నటుడు యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు. ఈయన రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడని అందరికీ తెలిసిందే. నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈయన కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమర దీపం, మనవూరి పాండవులు, మధుర స్వప్నం, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాల్లో హీరో కృష్ణంరాజు కావడం విశేషం. గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాలని నిర్మించారు. బిల్లా సినిమా కూడా ఈ బ్యానర్ లోనే నిర్మించారు.
ఈయన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. లంగ్ క్యాన్సర్ కారణంగా ఈయన 61 ఏళ్ల వయసులో 2010లో తుది శ్వాస విడిచారు. అయితే అభిమానులకు మాత్రం బాహుబలి లాంటి భారీ కటౌట్ ని, మంచి మనసున్న మారాజుని బహుమతిగా ఇచ్చి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఈ ఫోటో ఆయన యంగ్ గా ఉన్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటోలో ఆయన అచ్చం ప్రభాస్ లానే కనిపిస్తున్నారు. అసలు ఈయన ఎందుకు హీరోగా చేయలేదా? అని అనిపించకమానదు. అంత అందంగా, ఆజానుభాహుడిలా ఉన్నారు ఆయన. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.