Keerthi
యూత్ ఫెవరెట్ సినిమాగా నిల్చిన రాజా రాణి సినిమాలో దర్శకుడు అట్లీ ఓ చిన్న పొరపాటును చేశాడు. దానిని ఎప్పుడైనా గమనించారా..?
యూత్ ఫెవరెట్ సినిమాగా నిల్చిన రాజా రాణి సినిమాలో దర్శకుడు అట్లీ ఓ చిన్న పొరపాటును చేశాడు. దానిని ఎప్పుడైనా గమనించారా..?
Keerthi
దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ‘రాజా రాణి’ సినిమా గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ సినిమా విడుదలై చాలాకాలం అయినా ఇప్పటికి ఈ సినిమా టీవిలో వస్తే చాలు ప్రేక్షకులు అతుక్కుపోతారు. అంతలా రాజా రాణి సినిమా ప్రేక్షకులకు హృదయాలకు కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో లవ్, ఎమోషన్స్ అనేవి యువతకు బాగా ఆకట్టుకున్నాయి. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా 2014 మార్చి 14న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇందులో ఆర్య, నయనతార, నజ్రియా, జై ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ప్రేమ, పెయిల్యూర్, పెళ్లి’ అనే ఆంశంతో రూపొందిన రాజా రాణి చిత్రంలో ప్రతిఒక్క పాత్ర ప్రేక్షకులను జీవించేలా ఏడ్పించేశారు. మరి, అంతా సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాలో దర్శకుడు అట్లీ ఓ చిన్న పొరపాటు చేశాడు. దానిని ఎప్పుడైనా గమనించారా..?
సాధారణంగా ఒక స్టార్ సెలబ్రిటీ నటించిన సినిమాను.. వేరే నటుల సినిమాలో చూపించడం కామన్. కానీ, వారు నటించిన సినిమాలోనే మునపటి సినిమాకు సంబంధించి పాత్ర చూపించడం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం. అసలు ఏం జరిగిందంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమా అప్పటిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలోని నయనతార కూడా రజనీతో ఓ పాటలో ఆడిపాడిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు అట్లీ తెరకెక్కించిన రాజా రాణి సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా నటించింది. ఇందులో హీరో ఆర్య, అతని స్నేహితుడు కలిసి సినిమాకు వెళ్లినప్పుడు.. అక్కడ ఇదే శివాజీ సినిమాకు సంబంధించి ఓ సీన్ ను చూపిస్తారు. అందులో రజనీకాంత్ తో పాటు నయనతార కూడా నటిస్తుంది. ఇది ఎంతమంది గమనించారో తెలియదు కానీ, అసలు ఒక స్టార్ హీరోయిన్ అయిన నయనతార.. తాను నటించిన సినిమాలోనే వేరొక సినిమాకు సంబంధించి పాత్రను చూపించడం అనేది సమంజసం కాదు. మరి ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన రాజా రాణి సినిమాలో దర్శకుడు అట్లీ ఈ ఒక్క లాజిక్ ను ఎలా మార్చిపోయాడనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి, రాజా రాణి సినిమాలో నయనతార శివాజీ సినిమాను చూపించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.