iDreamPost
android-app
ios-app

Salaar: సలార్ ట్రైలర్-2 గమనించారా? ఇంకొన్ని దాచారట!

  • Published Dec 18, 2023 | 8:17 PM Updated Updated Dec 18, 2023 | 8:17 PM

ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రూపొందిన సలార్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమాను దర్శకుడు ఇవ్వబోతున్నాడు. రెండో ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. మరి సలార్ ట్రైలర్-2 గమనించారా? దాంట్లో ఇంకొన్ని దాచారట.

ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రూపొందిన సలార్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమాను దర్శకుడు ఇవ్వబోతున్నాడు. రెండో ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. మరి సలార్ ట్రైలర్-2 గమనించారా? దాంట్లో ఇంకొన్ని దాచారట.

  • Published Dec 18, 2023 | 8:17 PMUpdated Dec 18, 2023 | 8:17 PM
Salaar: సలార్ ట్రైలర్-2 గమనించారా? ఇంకొన్ని దాచారట!

క్రిస్మస్ కానుకగా విడుదల అవ్వబోతున్న సలార్ నుంచి రెండో ట్రైలర్ ను రిలీజ్‌ ట్రైలర్ అంటూ విడుదల చేశారు మేకర్స్. ఉదయం విడుదల చేస్తాం అంటూ ప్రకటించిన మేకర్స్ మధ్యాహ్నాం రెండు గంటలకు వాయిదా వేశారు. రెండు గంటలకు కూడా విడుదల చేయలేదు. మరో గంట ఆలస్యంగా మూడు గంటల మూడు నిమిషాలకు రిలీజ్ ట్రైలర్‌ ను యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ రిలీజ్ ట్రైలర్‌ లో సినిమాలోని మూడు యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన షాట్స్‌ మాత్రమే చూపించడం జరిగిందట. సినిమాలో మొత్తం అయిదు యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. ఆ అయిదు యాక్షన్‌ సన్నివేశాలు కూడా నభూతో అన్నట్లుగా ఉంటాయని మొదటి నుంచి కూడా మేకర్స్ చెబుతున్నారు. తాజా ట్రైలర్‌ లో యాక్షన్‌ సన్నివేశాలు మైండ్‌ బ్లోయింగ్‌ అన్నట్లుగా ఉంటాయని చెప్పడంతో పాటు, కథ ను కాస్త రివీల్‌ చేయడంతో పాటు హీరో పాత్రను ఇంకా నేపథ్యాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది.

రిలీజ్‌ ట్రైలర్ లో ప్రభాస్ విజువల్స్ తో పాటు, యాక్షన్‌ సన్నివేశాల తాలూకు షాట్స్ చూస్తే సినిమా ఇంకెప్పుడు చూస్తామా అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా నరాలు తెగేంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. బేబీ నిర్మాత ఎక్స్ ద్వారా నిర్మాతలకు దయచేసి సలార్‌ ను రేపే విడుదల చేయండి.. రెండో ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమాను వెంటనే చూడకుండా ఉండలేక పోతున్నాం అంటూ ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు అందరి పరిస్థితి కూడా అలాగే ఉంది అనడంలో సందేహం లేదు. యాక్షన్‌ తో పాటు, ప్రభాస్‌ నుంచి ఏదైతే కోరుకుంటున్నామో, ప్రశాంత్‌ నీల్‌ ఏ స్థాయిలో సినిమాను తీసి ఉంటాడని అనుకున్నామో అంతకు మించి ఉండబోతుందని తేలిపోయిందని ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు, ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కేజీఎఫ్‌ లోని యాక్షన్‌ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. ఇప్పుడు సలార్‌ లోని యాక్షన్‌ సన్నివేశాలు కేజీఎఫ్‌ యాక్షన్‌ సన్నివేశాలకు పది రెట్లు అదనంగా ఉండేట్లుగా ప్రశాంత్ నీల్‌ రూపొందించాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ట్రైలర్‌ చూస్తే అదే అనిపిస్తుంది. కేవలం మూడు ఫైట్స్ కి సంబంధించిన షాట్స్ చూస్తేనే మతి పోతుంది. ఇక మొత్తం అయిదు యాక్షన్‌ సన్నివేశాలను సినిమాలో మొత్తంగా చూస్తే బీభత్సం అన్నట్లుగా ఉంటుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభాస్‌ కి జోడీగా శృతి హాసన్‌ ఈ సినిమాలో నటించింది. ఆమె పాత్రకు సంబంధించిన షాట్స్ ను కూడా రిలీజ్ ట్రైలర్‌ లో చూడవచ్చు. యాక్షన్‌ షాట్స్ ను చూపిస్తూనే అన్ని పాత్రలను కవర్‌ చేసిన రెండో ట్రైలర్‌ సినిమా స్థాయిని మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు. రెండో ట్రైలర్‌ చూసిన తర్వాత సలార్‌ ఎంత వసూళ్లు చేస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet