iDreamPost
android-app
ios-app

ఏంటీ ఈ సినిమా తీసింది సుధా కొంగరానా..? నమ్మలేం..!

ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని సార్లు ఎక్కడో ఒక చోట తప్పిదాలు జరుగుతుంటాయి. వేసిన తొలి అడుగే తడబడినా.. ఆ మూవీని గుణ పాఠంగా మార్చుకుని.. నేషనల్ అవార్డును గెలుచుకోవడమే కాదూ.. ఇప్పుడు బాలీవుడ్ లో బడా హీరోను డైరెక్టర్ చేసే స్థాయికి చేరింది ఈ దర్శకురాలు.

ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని సార్లు ఎక్కడో ఒక చోట తప్పిదాలు జరుగుతుంటాయి. వేసిన తొలి అడుగే తడబడినా.. ఆ మూవీని గుణ పాఠంగా మార్చుకుని.. నేషనల్ అవార్డును గెలుచుకోవడమే కాదూ.. ఇప్పుడు బాలీవుడ్ లో బడా హీరోను డైరెక్టర్ చేసే స్థాయికి చేరింది ఈ దర్శకురాలు.

ఏంటీ ఈ సినిమా తీసింది సుధా కొంగరానా..? నమ్మలేం..!

తప్పుల నుండి ఒప్పులు నేర్చుకుంటుంటాం. అదే జీవిత పాఠం. అలాగే ప్రపంచంలో ఏ ఒక్కరు ఫర్ ఫెక్ట్ కాదు. పొరపాట్లు చేసినప్పుడు అక్కడే ఆగిపోతే.. గమ్య స్థానాల వైపు అడుగులు పడవు. సక్సెస్ తీరాలు తాకలేం. తప్పులు, పొరపాట్ల నుండి గుణ పాఠాలు నేర్చుకుని.. తిరిగి మళ్లీ ప్రయత్నాలు చేసి.. విజయం సాధించిన వారెందరో. ప్రతి రంగంలో కూడా ఇలాంటి ఒడిదుకులు ఎదుర్కొని.. నేడు సక్సెస్ స్టోరీస్‌గా మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నమహానుభావులు అనేక మంది ఉన్నారు. ఆ కోవలోకే వస్తారు ఈ డైరెక్టర్ కూడా. కెరీర్ మొదట్లో చిన్న చితకా సినిమాలు చేసిన ఈ దర్శకురాలు జాతీయ స్థాయి అవార్డును గెలుచుకునే డైరెక్టర్ అవుతుందని ఎవ్వరూ ఊహించి వుండరు. ఆమె కృషే కీర్తి కిరీటాలకు కారణమైంది.

మాయ ప్రపంచమైనా సినీ రంగంలో మహిళా దర్శకులు చాలా అరుదు. వారిలో పేరు గడించిన వారిలో భానుమతి, విజయ నిర్మల, నందిని రెడ్డి వంటి వారే కనిపిస్తారు. ఆ కోవకే వస్తారు.. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర. ఇప్పటికీ వరకు ఈ ముగ్గురికి సాధ్యం కానీ జాతీయ అవార్డును కొల్లగొట్టారు సుధా. సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా.. హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు సూర్యతో కూడా మరో మూవీ ఎనౌన్స్ చేశారు. అయితే ఇంతటి సక్సెస్ ఉమెన్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న సుధా.. ఒకప్పుడు.. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారనే విషయం ఎవ్వరికీ తెలియదు.

మిత్ర్, మై ఫ్రెండ్ అనే ఓ చిన్న సినిమాకు సుధా కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా మారారు ఈ తెలుగింటి ఆడ పడుచు. 2008లో కృష్ణ భగవాన్, అభియనశ్రీ ప్రధాన పాత్ర ధారులుగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కించిన మూవీ ఆంధ్ర అందగాడు దర్శకురాలిగా ఆమెకు తొలి సినిమా. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ.. దూసుకెళుతున్నారు. తర్వాత ద్రోహి, ఇరుది సుట్రు సాలా ఖుద్దూస్ మూవీతో పేరు వచ్చింది. దీన్నే తెలుగులో వెంకటేష్ హీరోగా గురు పేరుతో తెరకెక్కించగా.. హిట్ కొట్టింది. ఆ తర్వాత సూరారై పొట్రూ.. మూవీతో ఆమె పేరు కోలీవుడ్ నుండి బాలీవుడ్ కు మారు మ్రోగిపోయింది. ఈ సినిమా గత ఏడాది జాతీయ అవార్డుల్లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు సూర్యతో పురాణ నూర్ అనే మూవీతో రాబోతుంది. తొలి అడుగు తడబడ్డా.. మలి అడుగుతో సక్సెస్ అయ్యింది ఈ టాలెంట్ డైరెక్టర్.