iDreamPost
android-app
ios-app

రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన సూర్య.. కారణం ఏంటో తెలుసా?

  • Published Jul 17, 2024 | 11:49 AM Updated Updated Jul 17, 2024 | 11:49 AM

రాజమౌళి తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ మూవీలో ఓ పాత్ర చేయమని కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను అడిగితే.. ఆ పాత్రకు నో చెప్పాడట. మరి ఇంతకీ ఆ మూవీ ఏది? సూర్య ఎందుకు నో చెప్పాడు? ఆ వివరాలు..

రాజమౌళి తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ మూవీలో ఓ పాత్ర చేయమని కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను అడిగితే.. ఆ పాత్రకు నో చెప్పాడట. మరి ఇంతకీ ఆ మూవీ ఏది? సూర్య ఎందుకు నో చెప్పాడు? ఆ వివరాలు..

  • Published Jul 17, 2024 | 11:49 AMUpdated Jul 17, 2024 | 11:49 AM
రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన సూర్య.. కారణం ఏంటో తెలుసా?

SS రాజమౌళి.. టాలీవుడ్ కు తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చాడు. తన టేకింగ్, మేకింగ్ తో ఇండస్ట్రీలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు. అలాంటి అగ్ర దర్శకుడి సినిమాలో ఛాన్స్ వస్తే.. ఎవరైనా ఎగిరి గెంతేస్తారు కానీ, నో చెబుతారా? జక్కన్న మూవీలో చిన్న పాత్ర వచ్చినా చాలు చేసేందుకు ప్రముఖ యాక్టర్స్ ఎదురుచూస్తుంటారు. అలాంటి ఓ రాజమౌళి తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ మూవీలో ఓ పాత్ర చేయమని కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను అడిగితే.. ఆ పాత్రకు నో చెప్పాడట. మరి ఇంతకీ ఆ మూవీ ఏది? సూర్య ఎందుకు నో చెప్పాడు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ రేంజ్ ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ గా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయన మూవీలో చిన్న ఛాన్స్ వచ్చినా చాలు అనుకునే నటీ, నటులు ఎంతో మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం కొన్ని కారణాల వల్ల జక్కన్న మూవీలో నటించే అవకాశాలను వదులుకున్నారు. ఆ జాబితాలో స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఉన్నారు. సునీల్ తో తీసిన ‘మర్యాదరామన్న’ చిత్రంలో త్రిషను నటించాల్సిందిగా కోరగా.. ఆమె సున్నితంగా తిరస్కరించిందట. ఇక ఈ లిస్ట్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకూడా ఉన్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి 2004లో నితిన్, జెనీలియా జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సై’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీలో శశాంక్ పోషించిన పాత్రను చేయాల్సిందిగా తొలుత సూర్యను అడిగాడట జక్కన్న. అయితే అప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు సూర్య. దాంతో సెకండ్ హీరోగా చేస్తే, అవకాశాలు వస్తాయో? రావో? అన్న భయంతో సూర్య జక్కన్న ఆఫర్ ను తిరస్కరించాడట. దాంతో ఆ పాత్రక శశాంక్ ను తీసుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అండ్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss