iDreamPost
android-app
ios-app

మరో తెలుగు దర్శకుడితో ధనుష్ సినిమా?

  • Published Apr 01, 2024 | 12:41 PM Updated Updated Apr 01, 2024 | 12:42 PM

తమిళ స్టార్ హీరో ధనుష్ అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు.ఇక రఘువరన్ బీ టెక్ సినిమాతో ఆయనకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.

తమిళ స్టార్ హీరో ధనుష్ అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు.ఇక రఘువరన్ బీ టెక్ సినిమాతో ఆయనకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.

  • Published Apr 01, 2024 | 12:41 PMUpdated Apr 01, 2024 | 12:42 PM
మరో తెలుగు దర్శకుడితో ధనుష్ సినిమా?

తమిళ స్టార్ హీరో ధనుష్ అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు. అద్భుతమైన నటనతో భాషలకు అతీతంగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ధనుష్ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న విషయం తెలిసిందే. మొదటి నుంచీ తెలుగు ప్రేక్షకులకి ధనుష్ అంటే ఎంతో ఇష్టం. ఇక రఘువరన్ బీ టెక్ సినిమాతో ఆయనకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక 2023 లో సార్ (వాతి) సినిమాతో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తున్న ధనుష్, త్వరలోనే మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్లుగా దర్శకుడు కిషోర్ బి ‘శ్రీకారం’ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు తమిళ హీరో ధనుష్ తో కిషోర్ బి సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ధనుష్ కి కిషోర్ బీ ఒక కథ చెప్పారని, ధనుష్ కూడా స్క్రిప్ట్ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. నిర్మాత దిల్ రాజు తన బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరి ధనుష్ కిషోర్ బి ఎలాంటి కథ రాశాడో చూడాలి. వాస్తవానికి, హీరో నితిన్‌తో కిషోర్ బి ఒక సినిమాకి కలిసి పని చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నితిన్ స్థానంలో ధనుష్ పేరు వినిపిస్తోంది. ధనుష్ తన కొత్త ప్రాజెక్ట్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారని అంటున్నారు.

ధనుష్ సినిమాల్లో అయితే ఒక మంచి సందేశం ఉంటుంది లేదా కాస్త కొత్త తరహా కాన్సెప్ట్ ఉంటుంది. అయన గత సినిమాలైన సార్, కెప్టెన్ మిల్లర్ లని గమనిస్తే ఒకటి చదువు గురించి సందేశం ఇచ్చిన సినిమా అయితే మరొకటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్. ఇక దర్శకుడు కిశోర్ బి శర్వానంద్ తో తెరకెక్కించిన శ్రీకారం సినిమా చూస్తే అది రైతు సమస్యల పై తీశారు. మరిప్పుడు వార్తల ప్రకారం ధనుష్ – కిషోర్ బి కాంబినేషన్లో సినిమా వస్తే అది ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తుందో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet