iDreamPost
android-app
ios-app

అక్కడుంది ‘సలార్’.. అంత పెద్ద రిస్క్ అవసరమా ధనుష్?

  • Author ajaykrishna Updated - 11:58 AM, Tue - 3 October 23
  • Author ajaykrishna Updated - 11:58 AM, Tue - 3 October 23
అక్కడుంది ‘సలార్’.. అంత పెద్ద రిస్క్ అవసరమా ధనుష్?

ఈ ఏడాది బిగ్ బజ్ తో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలలో కెప్టెన్ మిల్లర్ ఒకటి. స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ఈ సినిమా.. డిసెంబర్ 15న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్.. సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో ఫ్యాన్స్ లో సినిమాపై హైప్ గట్టిగానే సెట్ అయ్యింది. ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ కూడా ఓకే అనుకున్నారు. కానీ.. అది సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వకముందు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రిలీజ్.. డిసెంబర్ 22న ఫిక్స్ చేశారు మేకర్స్. రీసెంట్ గా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీంతో ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ డైలామాలో పడింది.

అందుకు కారణం కూడా లేకపోలేదు. కెప్టెన్ మిల్లర్ రిలీజ్ అయిన వారానికి సలార్ వస్తోంది. సలార్ తో పాటు అదే రోజు కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకి’ కూడా రాబోతుంది. ఆల్రెడీ డిసెంబర్ నెలలో సలార్ – డుంకిల క్లాష్ బిగ్గెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ వర్సెస్ షారుఖ్ అంటే బాక్సాఫీస్ వద్ద వార్ మాములుగా ఉండదు. పైగా డుంకి లెజెండ్ రాజ్ కుమార్ హిరాని సినిమా. మరోవైపు సలార్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సినిమా. సో.. డిసెంబర్ అనగానే అందరికీ సలార్, డుంకి రేస్ అని అర్థమైంది. సరే.. సలార్ కి వారం ముందే వస్తోందిగా కెప్టెన్ మిల్లర్ అనుకుంటే.. కేవలం వారం రోజుల్లోనే కలెక్షన్స్ టార్గెట్ రీచ్ కావాల్సి ఉంటుంది. పైగా ధనుష్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ మూవీ ఇది.

ఇక సలార్ కి వారం ముందుగా అంటే రిస్క్ తో కూడుకున్న విషయం. ఎందుకంటే.. సలార్ లేకుండా కేవలం డుంకి మాత్రమే పోటీ ఉండుంటే.. సరే బాలీవుడ్ మూవీ కదా అనుకోవచ్చు. కానీ.. ప్రభాస్ సలార్ మూవీ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆల్రెడీ ఇదివరకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అర్ధమవుతుంది. మరి ఇలాంటి సమయంలో కెప్టెన్ మిల్లర్ విషయంలో ధనుష్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇంకో వారం వెనక్కి వస్తుందా? లేదా వాయిదా పడుతుందా? ఒకవేళ వారం వెనక్కి తగ్గినా.. తమిళంలో రిలీజ్ లను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో.. కెప్టెన్ మిల్లర్ సలార్ ఎంట్రీతో రిస్క్ లో పడ్డాడని చెప్పుకోవచ్చు. ఇక కెప్టెన్ మిల్లర్ మూవీని అరుణ్ మాథశ్వరన్ తెరకేక్కిస్తున్నారు. మరి ధనుష్ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/