iDreamPost
android-app
ios-app

ధనుష్-ఐశ్వర్య విడాకులు.. ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు!

  • Published Apr 08, 2024 | 6:38 PM Updated Updated Apr 08, 2024 | 6:38 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకనున్నారు. ఈ మేరకు చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకనున్నారు. ఈ మేరకు చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

  • Published Apr 08, 2024 | 6:38 PMUpdated Apr 08, 2024 | 6:38 PM
ధనుష్-ఐశ్వర్య విడాకులు.. ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు!

అభిమానులు అనుకున్నదే అయ్యింది. తమిళ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకుంటున్నారు. అయితే తాము డైవర్స్ తీసుకుంటున్నట్లు రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. 2022 జనవరిలో ఈ జంట ఈ విషయాన్ని అభిమానులకు తెలిపారు. అప్పటి నుంచి ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. అయితే తాజాగా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకనున్నారు. ఈ జంట 2022లోనే విడిపోతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వీరిద్దరు వేరువేరుగానే ఉంటున్నారు. ఇక తాజాగా పరస్పర అంగీకారంతో చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి కేసు విచారణకు రానున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

కాగా.. ధనుష్-ఐశ్వర్య 2004లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే విడాకుల ప్రకటన తర్వాత చాలా గ్యాప్ రావడంతో.. ఈ జంట మళ్లీ కలుస్తారని చాలా మంది భావించారు, చాలా సార్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ అభిమానులకు చివరగా నిరాశే మిగిలింది. కాగా.. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ తో లాల్ సలామ్ సినిమాను తెరకెక్కించి.. భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది ఐశ్వర్య. ఇక మరోవైపు ధనుష్ రాయన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మరి స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişrekabet girişgrandpashabet