iDreamPost
android-app
ios-app

స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ మూవీ.. ఇలాంటి సినిమాతో వస్తుందేంటి!

  • Published Apr 08, 2024 | 4:13 PM Updated Updated Apr 08, 2024 | 6:27 PM

ఓటీటీలోకి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వెండి తెరపై ఫేమస్ అయిన హీరోలు హీరోయిన్లు కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ ఇచ్చిన హర్రర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలోకి రాబోతుంది. దానికి సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చూసేద్దాం.

ఓటీటీలోకి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వెండి తెరపై ఫేమస్ అయిన హీరోలు హీరోయిన్లు కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ ఇచ్చిన హర్రర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలోకి రాబోతుంది. దానికి సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చూసేద్దాం.

  • Published Apr 08, 2024 | 4:13 PMUpdated Apr 08, 2024 | 6:27 PM
స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ మూవీ.. ఇలాంటి సినిమాతో వస్తుందేంటి!

ఓటీటీ లకు రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఎంత జాగ్రత్తగా వారి వారి సినిమాలను, సిరీస్ లను ప్లాన్ చేసుకుంటున్నారో.. ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుని అవకాశాలు లేక సైలెంట్ అయిపోయిన ఎంతో మంది నటి నటులు కూడా ఈ ఓటీటీ అవకాశాలను అదే రేంజ్ లో అందిపుచ్చుకుని.. సరి కొత్త సినిమాలతో, సిరీస్ లతో తిరిగి ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతో మంది వెండి తెర పాపులర్ స్టార్స్ ఓటీటీలో దర్శనం ఇవ్వగా .. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఓటీటీ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ సమర్పణలో హారర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న సినిమా “భవనమ్”. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే పూర్తి వివరాలను చూసేద్దాం.

స్నేహ ఉల్లాల్ తెలుగులో తీసింది కొన్ని సినిమాలే అయినా కూడా.. ఈమెకు పాపులారిటీ మాత్రం బాగానే ఉంది. అయితే కొన్ని సినిమాల తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరం అయింది. దానికి గల కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ, ఇక ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని స్నేహ ఉల్లాల్ ఇన్నాళ్లకు మళ్ళీ సినిమాలలకు రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే భవనమ్ అనే క్రేజీ ప్రాజెక్ట్ తో మన ముందుకు వచ్చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్ తో పాటు.. పాపులర్ కమెడియన్ ధనరాజ్, జబర్దస్త్ ఫేమ్ షకలక శంఖర్, అజయ్, మాళవిక సతీషన్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకు బాలాచారి కూరెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ను గమనిస్తే కనుక ఈ మూవీ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారని అర్ధమౌతుంది. ఈ చిత్రంలో సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్‌తో పాటు హ్యుమర్, ఫన్ ఎలిమెంట్స్‌ కూడా ఉండడంతో ఖచ్చితంగా ఈ సినిమా అందరికి నచ్చుతుందని చెప్పడంలో ఏ సందేహం లేదు.

కాగా భవనమ్ సినిమాకు ‘ది హాంటెడ్ హౌస్‌’ అనే ట్యాగ్ లైన్‌ ఇచ్చారు. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే థియేటర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారా లేదా డైరెక్ట్ గా ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక స్నేహ ఉల్లాల్ విషయానికొస్తే.. ఆమె మొదటిగా హిందీలో లక్కీ అనే సినిమాతో సినీ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో 2008లో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత కరెంట్, నేను మీకు తెలుసా సినిమాలతో కుర్రాళ్ల మదిలో నిలిచిపోయింది. అలా వరుసగా కొన్ని సినిమాలలో అలరించిన స్నేహ ఉల్లాల్ కొన్నాళ్ళు సినిమాలకు దూరం అయిపొయింది. ఇక ఎట్టకేలకు ఇన్నాళ్లకు చాలా కాలం గ్యాప్ తర్వాత ఓ మంచి ప్రాజెక్ట్ తో రీ ఎంట్రీ ఇస్తోంది. మరి, ఈ సినిమా టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique