iDreamPost
android-app
ios-app

దేవరోడు గట్టిగానే భయపెట్టాడు.. పుష్ప-2 కు భారీ టార్గెట్

  • Published Oct 05, 2024 | 6:18 PM Updated Updated Oct 05, 2024 | 6:18 PM

pushpa-2 : దేవర దేవర అంటూ ప్రేక్షకులు ఊగిపోతున్నారు. ఇప్పుడు దేవర హావ బాగానే నడుస్తూ ఉంది. ఇక ఇప్పుడు దేవర ఎఫెక్ట్ మిగిలిన సినిమాల మీద పడుతుంది. పుష్ప-2 ముందు పెద్ద టార్గెట్ ను ఫిక్స్ చేశాడు దేవర. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

pushpa-2 : దేవర దేవర అంటూ ప్రేక్షకులు ఊగిపోతున్నారు. ఇప్పుడు దేవర హావ బాగానే నడుస్తూ ఉంది. ఇక ఇప్పుడు దేవర ఎఫెక్ట్ మిగిలిన సినిమాల మీద పడుతుంది. పుష్ప-2 ముందు పెద్ద టార్గెట్ ను ఫిక్స్ చేశాడు దేవర. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

  • Published Oct 05, 2024 | 6:18 PMUpdated Oct 05, 2024 | 6:18 PM
దేవరోడు గట్టిగానే భయపెట్టాడు.. పుష్ప-2 కు భారీ టార్గెట్

డివైడ్ టాక్ తో మొదలైన దేవర.. మౌత్ టాక్ తో ఒక్కో రికార్డ్ ను నరుక్కుంటూ పోతుంది. ఇప్పట్లో రిలీజ్ కు రెడీగా ఏ సినిమాలు లేవు. సో దసరా వరకు దేవర జోరు తగ్గదు. ఇక వారం లోపే దేవర బ్రేక్ ఈవెన్ అయింది. దసరా అయ్యేలోపు ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక దేవర గ్రాండ్ ఓపెనింగ్స్ తర్వాత..నెక్స్ట్ రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఓ రకంగా దేవర ఆ సినిమాలకు సాయం చేస్తున్నట్లే. అటు కథతో ఈ జోనర్ లో వచ్చే సినిమాలకు ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అలాగే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ లేకపోయినా.. భారీ బడ్జెట్ కాకపోయినా సరే.. దేవరోడు మాత్రం బాగానే భయపెడుతున్నాడు. దేవర తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2. సో ఇప్పుడు అల్లు అర్జున్ ముందు భారీ టార్గెట్ ఉన్నట్లే.

మొదట్లో దేవరకు వచ్చిన డివైడ్ టాక్ తో.. పుష్ప-2 కు కాస్త కంగారు వచ్చింది. ఎందుకంటే దేవర మాదిరి పుష్ప-2 కూడా యాక్షన్ డ్రామానే. కానీ రోజు రోజుకి దేవర టాక్ మారడంతో.. పుష్ప కాస్త ఊపిరి పీల్చుకుంది. అలా ధైర్యాన్ని ఇచ్చిన దేవర.. ఇప్పుడు దానిని మించిన భయాన్ని కూడా ఇచ్చాడు. మొదటి రోజే 172 కోట్లు కొల్లగొట్టి గ్రాండ్ ఓపెనింగ్స్ చేశాడు. దీనితో పుష్ప-2 కు భయం మొదలైంది. ఆల్రెడీ పార్ట్-1 సూపర్ హిట్ కాబట్టి.. పార్ట్-2 హిట్ కూడా ముందే కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ అదే సమయంలో హాలీవుడ్ నుంచి రెండు సినిమాలు ఈ సినిమాకు పోటీగా రాబోతున్నాయి. సో అటు హాలీవుడ్ సినిమాల దెబ్బ ఇండియన్ మార్కెట్ పైన పడే ఛాన్స్ ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో సిక్వెల్ సెంటిమెంట్స్ అసలు వర్క్ అవుట్ అవ్వడం లేదు. ఇలా ఎటు చూసినా పుష్ప-2 ముందు అన్ని అడ్డంకులే కనిపిస్తున్నాయి. మరి ఈ టార్గెట్ ను బన్నీ అందుకుంటాడా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ ఇవన్నీ దాటి దేవరాలానే పుష్ప2 కు ప్రేక్షకులకు ఎక్కేస్తే మాత్రం.. ఈ లెక్కలు ఈజీగా దాటేయొచ్చు. మరి బన్నీ ఈ టార్గెట్ రీచ్ అవుతాడో లేదో చూడాలి.

ఇప్పటికే పుష్ప-2 కు మంచి బజ్ క్రియేట్ అయింది. త్వరలోనే వరుస అప్డేట్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సో వచ్చే ఈ అప్డేట్స్ ఇంపాక్ట్ మూవీ పైన హైప్ క్రియేట్ చేస్తుంది. అందులో డౌట్ లేదు. ఈలోపు దేవర ఓవరాల్ కలెక్షన్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి పుష్ప-2 ఎంత కొట్టాలి అనే టార్గెట్ ఫిక్స్ అయిపోతుంది. ఒకవేళ సిక్వెల్ సెంటిమెంట్స్ , హాలీవుడ్ ఎటాక్ ను బ్రేక్ చేసి.. పుష్ప-2 కలెక్షన్స్ కొల్లగొడితే మాత్రం.. ఇక ఈ సినిమాకు తిరుగు ఉండదు. మాస్ యాక్షన్స్ ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా చాలా ఈజీగా నచ్చేస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.. ఎప్పుడు వస్తాయో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetjojobet girişjojobetbetcio