iDreamPost
android-app
ios-app

కళ్యాణ్ రామ్ స్వీట్ న్యూస్! దేవర నుండి సూపర్ అప్డేట్!

  • Published Dec 12, 2023 | 6:35 PM Updated Updated Dec 12, 2023 | 6:48 PM

Devara Movie Update: స్టార్ డైరెక్టర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం దేవర. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి కల్యాణ్ రామ్.. దేవర మూవీ గురించి సూపర్ అప్ డేట్ ఇచ్చారు.

Devara Movie Update: స్టార్ డైరెక్టర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం దేవర. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి కల్యాణ్ రామ్.. దేవర మూవీ గురించి సూపర్ అప్ డేట్ ఇచ్చారు.

  • Published Dec 12, 2023 | 6:35 PMUpdated Dec 12, 2023 | 6:48 PM
కళ్యాణ్ రామ్ స్వీట్ న్యూస్!  దేవర నుండి సూపర్ అప్డేట్!

నందమూరి కల్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇటీవలే బింబిసార సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న సినిమా డెవిల్.  ఈసినిమాను అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే  డెవిల్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది ప్రేక్షుకలను ఎంతగానో ఆకట్టుకుంది. డెవిల్ మూవీ ప్రమోషన్ కల్యాణ్ రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బింబిసార -2 ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించి సూపర్ అప్ డేట్ ను కల్యాణ్ రామ్ ఇచ్చారు.

డెవిల్‌ సినిమా విషయంలో కల్యాణ్‌ రామ్‌  అభిమానుల ఎదురు చూపుకు తెరపడింది. విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు కొద్దిరోజుల క్రితమే డెవిల్‌ మేకర్స్ తెరదించారు. డిసెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా డెవిల్  విడుదల కానున్నట్లు తెలిపారు. విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. సినిమా టీం ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం డెవిల్ ట్రైలర్‌ యూట్యూబ్‌లోకి వచ్చింది.

అయితే డెవిల్ మూవీ ప్రమోషన్ లో కల్యాణ్ రామ్ కీలక విషయాలు తెలిపారు. బింబిసార-2 ఉంటుందని, ఇది వచ్చే ఏడాది ఏప్రిల్, మే మొదలవుతుంది ఆయన తెలిపారు. అంతేకాక డేవిల్ సినిమా నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని తెలిపారు. ఇక ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకు సంబంధించిన సూపర్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్న అభిమానులు కల్యాణ్ రామ్ గుడ్ న్యూస్ చెప్పారు.

కల్యాణ్ రామ్ మాట్లాడుతూ..” తమ్ముడు సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వొద్దాన్నాడు. ట్రిపులార్ లాంటి సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా దేవర. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో మాకు తెలుసు. అందుకే అతి త్వరలో దేవర సినిమా నుంచి గ్లిమ్స్ రాబోతున్నాయి. దానికి కావాల్సిన పనులు జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా టైమ్ పడుతుంది. బింబిసార సినిమాలో మీకు ఏ విధంగా కొత్త ప్రపంచాన్ని చూపించామో.. అలానే దేవర కొత్త ప్రపంచాన్ని చూపించబోతుంది. అందుకోసం ఏ చిన్న తప్పు జరగకుండా మేము బాధ్యతగా పనులు చేస్తున్నాము.  అతి తర్వలోనే మా టీమ్ దేవర గ్లిమ్స్ ను విడుదల చేయనుంది” అని కల్యాణ్ రామ్ తెలిపారు.కల్యాణ్ రామ్ ఇచ్చిన అప్డేట్ తో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవర గ్లిమ్స్ ఎలా ఉంటుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక కల్యాణ్ రామ్ డెవిల్ సినిమా విషయానికి వస్తే.. ఆయన మరోసారి వన్‌ మ్యాన్‌ ఆర్మీ షో చేసేశారు. ట్రైలర్‌ ఉన్న రెండు డైలాగులు కూడా విజిల్స్‌ వేయించేలా ఉన్నాయి. మొత్తానికి సినిమా విజువల్‌ ఫీస్ట్‌లా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌కు జంటగా.. సంయుక్త మీనన్‌, మాళవిక నాయర్‌ నటించారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాడు. మరీ.. దేవర మూవీపై కల్యాణ్ ఇచ్చిన అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetepikbahis girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom