iDreamPost
android-app
ios-app

Devara Movie: అక్కడి బాక్సాఫీస్ వద్ద దేవర అరాచకం!

Devara Movie: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు నుంచి.. ఇంకా తగ్గేదె లే అనే రోజు వరకు వచ్చేసింది. దేవర సినిమా థియేటర్స్ లో దంచి కొడుతోంది. తెలుగులోనే కాదు.. తమిళం , మలయాళం , కన్నడ , హిందీ ఎక్కడ చూసిన దేవర గురించి పాజిటివ్ టాకే వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఏరియాలో దేవర ఆరాచకం సృష్టిస్తుంది.

Devara Movie: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు నుంచి.. ఇంకా తగ్గేదె లే అనే రోజు వరకు వచ్చేసింది. దేవర సినిమా థియేటర్స్ లో దంచి కొడుతోంది. తెలుగులోనే కాదు.. తమిళం , మలయాళం , కన్నడ , హిందీ ఎక్కడ చూసిన దేవర గురించి పాజిటివ్ టాకే వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఏరియాలో దేవర ఆరాచకం సృష్టిస్తుంది.

Devara Movie: అక్కడి బాక్సాఫీస్ వద్ద  దేవర అరాచకం!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో కొందరు హీరోలు మాత్రమే చరిత్రను తిరగరాసే వాళ్లు ఉంటారు.  ముఖ్యంగా అతికొద్ది మంది స్టార్ హీరోలు మాత్రమే వరుస హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉంటున్నారు. వారిలో మ్యాన్ ఆఫ్ మాసేస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.  ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు తారక్. ఆ సినిమా తరువాత రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. దాదాపు ఆరేళ్ల తరువాత సోలో హీరోగా దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా దేవర సినిమా గ్రాండ్ గా రిలీజైన్ సంగతి తెలిసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ దేవర సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న మాస్ ఫాలోయింగ్ తో కలెక్షన్ల దుమ్ముదులిపేశాడు. తన ఫాలోయింగ్ కు తగ్గట్లు సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో తన తాజా మూవీ దేవరతో బాక్సాఫీస్ కు చూపించాడు. దర్శఖకుడు కొరటాల శివ  తెరకెక్కించిన ఈ సినిమాకు తొలి రోజే భారీ కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే 172 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఓవర్సిస్ మార్కెట్ లో ఎన్టీఆర్ తన స్టామినా ఏమిటో చూపించాడు.

అమెరికా బాక్సాఫీస్ వద్ద దేవర వసూల సునామీ సృష్టించింది. ఒక నార్త్ అమెరికాలోనే  దేవర్ 3.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ ను వసూలు చేసింది.  ఈ వసూళ్లతో మరే భారతీయ సినిమా అందుకోని రికార్డును దేవర నెలకొల్పింది. పూర్తిగా ఒక రోజు కాకుండానే దేవర ఈ రేంజ్ లో  శివతాండవం చేస్తున్నాడంటే.. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారీ వసూలు అందుకుంటున్న దేవర..యూఎస్ మార్కెట్ లో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అనిరుధ్ మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పాల్సిందే. కారణంగా..సినిమాకు సంగం ప్రాణం పోసింది…అనిరుద్ మ్యూజిక్. అంతేకాక ఈ సినిమాలోనే బీజీఎమ్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మొత్తంగా దేవర సినిమా..తారక్ చెప్పినట్లే..ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే స్థాయిలో ఉంది. మరి..యూఎస్ లో దేవర సృష్టించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.